హోదా మాతోనే సాధ్యం: రఘువీరా

Published: Tuesday August 21, 2018
అనంతపురం,  : à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ 2014లో గెలుస్తుందని ఎవరూ అనుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నాడు వైసీపీదే విజయమని అనుకున్నారని.. కానీ టీడీపీని ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా జనం కాంగ్రెస్ వైపే ఉంటారని ధీమాగా చెప్పారు.
 
సోమవారం అనంతపురం శివారులోని à°“ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో à°† పార్టీ జిల్లా సమన్వయకర్తల సమావేశం జరిగింది. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఏఐసీసీ కార్యద ర్శులు మెయ్యప్పన్‌, శైలజానాథ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, జంగా గౌతమ్‌లతో కలిసి రఘువీరా మీడియాతో మాట్లాడారు. ‘తెలుగుదేశం, పవన్‌, జగన్‌ పార్టీలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాయి. à°ˆ పార్టీలతో ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, మహిళా, కాపులకు రిజర్వేషన్లు సాధించడం సాధ్యమా? ఎలాగూ బీజేపీ చేయలేమని చేతులెత్తేసింది. అందుకే ఏ పార్టీతో మాకు పొత్తుండదు. ప్రత్యేక హోదా కాంగ్రె్‌సతోనే సాధ్యమని నూటికి 97.8 శాతం మంది విశ్వసిస్తున్నారు’ అని తెలిపారు.