12న 100వ స్వదేశి ఉపగ్రహం . సెంచురి దిశగా ఇస్రొ ప్రయొగాలు

Published: Wednesday January 10, 2018

సెంచురి దిశగా ఇస్రో . భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో సెంచరీ కొట్టబోతుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి లాంచ్‌ప్యాడ్‌ నుంచి à°ˆ నెల 12à°¨ ఉదయం 9.28 నిమిషాలకు పీఎ్‌సఎల్‌వీ సీ-40 రాకెట్‌ ద్వారా స్వదేశీ వందో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీంతోపాటు మరో 30 శాటిలైట్లను ఒకేసారి రోదసిలోకి పంపుతారు. à°ˆ మిషన్‌కు సంబంధించిన వివరాలను ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ అన్నాదురై బెంగళూరులో మంగళవారం మీడియాకు వివరించారు.  కిందటి ఏడాది ఆగస్టులో పీఎ్‌సఎల్‌వీ సీ-30 ప్రయోగం విఫలమైంది. à°† మిషన్‌లో తలెత్తిన లోపాలను గుర్తించి, మరోసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంవల్లే పీఎ్‌సఎల్‌వీ సీ-40 ప్రయోగానికి ఇంత సమయం పట్టిందని ఆయన వివరించారు. పీఎ్‌సఎల్‌వీ సీ-40 ద్వారా మన శాస్త్రవేత్తలు పంపుతున్న వందో భారత ఉపగ్రహం కార్టోశాట్‌-2ఈఆర్‌. భూ వాతావరణంలో మార్పులను గుర్తించడానికి ఇదీ కీలకంగా పనిచేస్తుంది. దీని బరువే 710 కేజీలు. మిగతా 30 ఉపగ్రహాల బరువు 613 కిలోలు. కార్టోశాట్‌-2ఈఆర్‌తోపాటు పీఎ్‌సఎల్‌వీ సీ-40 రాకెట్‌ మోసుకెళ్తున్న మరో 30 ఉపగ్రహాలలో ఇంకో రెండు భారత్‌కు చెందినవే. à°’à°•à°Ÿà°¿ మైక్రో శాటిలైట్‌కాగా, రెండోది నానో శాటిలైట్‌. మిగతా 28 ఉపగ్రహాలలో అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 3 మైక్రో, 25 నానో శాటిలైట్లు ఉన్నాయి. భారత్‌ చేపట్టిన మరో ప్రాజెక్టు చంద్రయాన్‌. ఇందులో భాగమైన చంద్రయాన్‌-2ను à°ˆ ఏడాదే ప్రయోగిస్తామని అన్నాదురై తెలిపారు.