ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం..

Published: Wednesday August 22, 2018
చోడవరం(విశాఖ జిల్లా): à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡ కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు వైఖరికి నిరసగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని చోడవరం మేజర్‌ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్‌ à°Žà°‚.వీ. సాగర్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. 1983 నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నానని, పార్టీలో పలు పదవులు కూడా నిర్వహించానన్నారు. చోడవరం పంచాయతీ ఎన్నికల్లో తను అందించిన సహకారం వల్లే చాలా వార్డులు గెలుచుకున్నామని చెప్పారు. à°† ఎన్నికల్లో తనతో రూ.26 లక్షల వరకు ఖర్చు పెట్టించారని, తీరా ఉప సర్పంచ్‌à°—à°¾ ఎన్నికైన తరువాత ఎమ్మెల్యే తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
 
పంచాయతీలో జరిగిన ఏ కార్యక్రమంలోనూ తన ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరించారని ఆరోపించారు. తనను ఆర్థికంగా ఉపయోగించుకుని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడడం బాధ కలిగించే అంశమైనప్పటికీ, ఎమ్మెల్యే వైఖరితో విసుగుచెంది పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరబోనని, అభిమానులు అనుచరుల నిర్ణయం మేరకు భవిష్యత్‌ నిర్ణయం ఉంటుందని చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపుతున్నానన్నారు.