రాజధాని రైతులను రెచ్చగొట్టొద్దు పవన్‌..

Published: Friday August 24, 2018

 à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ రైతులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు పురపాలక మంత్రి నారాయణ హితవు పలికారు. ఆయన రాజకీయంగానే విమర్శలు చేస్తున్నారన్నారు. రైతులందరినీ సంప్రదించి.. భూసమీకరణ à°•à°¿à°‚à°¦ తీసుకున్న భూములకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తున్నామని తెలిపారు. పవన్‌ కోసం పాలసీలు మార్చలేమని తేల్చిచెప్పారు. రాజధాని అమరావతి నగర నిర్మాణ పనులను మంత్రి గురువారం పరిశీలించారు. à°ˆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాజధాని పనులు జరగడం లేదన్న విమర్శలను తిప్పికొట్టారు ప్రతిపక్షాల నాయకులు రాజఽధానికి వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడి అభివృద్ధిని పరిశీలించాలని సూచించారు. అవసరమైతే అధికారులను పంపించి వారికి అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు వివరిస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి అన్ని ప్రాంతాల ప్రజలకు రాజధాని నగరాన్ని చూపించనున్నామన్నారు. ‘2 లక్షల à°š.అడుగుల్లో నిర్మిస్తున్న సిటీ సివిల్‌ కోర్టులను డిసెంబరులో ప్రారంభిస్తాం. 630 పైల్స్‌ వేయాల్సి ఉండగా ఇప్పటికే 500 పూర్తయ్యాయి. మిగతావి పది రోజుల్లో అయిపోతాయి. 2019 మార్చికల్లా రాజధాని పనులు à°’à°• కొలిక్కి వస్తాయి.’ అని వెల్లడించారు.