పాములు దరికి రాకుండా ఉండటానికి...

Published: Saturday August 25, 2018
 à°šà°‚ద్రగిరి మండలం à°Ž.రంగంపేట సమీపంలోని నాగపట్ల ఈస్ట్‌ బీట్‌లో మూడు రోజులుగా ఎర్రచందనం దొంగల కదలికలు ఎక్కువయ్యాయి. టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌లో à°“ దొంగ పట్టుబడగా భారీగా వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రోజువారి తనిఖీలలో భాగంగా గురువారం రాత్రి నుండి టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో కూంబింగ్‌ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 5 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. పట్టుకునేందుకు ప్రయత్నంచగా సుమారు 15 మంది స్మగ్లర్లు అడవుల్లోకి పరారయ్యారు. సిబ్బంది వారిని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన విజయకుమార్‌à°—à°¾ తెలిసింది. భారీగా వంట సామాగ్రి నిమ్మకాయలు, చందనం, కర్పూరం లభ్యమయ్యాయి.
 
 
చందనం, కర్పూరం కలిపి రాసుకుంటే పాములు దరికి రావట !
పట్టుబడిన విజయకుమార్‌ను విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అడవుల్లో ఏమైనా క్రిమికీటకాలు, పాములు దగ్గరికి రాకుండా ఉండాలంటే పూజా సామాగ్రిలోని చందనం, కర్పూరం కలిపి పూసుకుంటామని, ఏమైనా కుట్టినా ఇదే మందు అని చెప్పాడు. సంఘటనా స్థలాన్ని ఐజి కాంతారావు, డీఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్‌ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్వో ప్రసాద్‌ పరిశీలించి టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ భాస్కర్‌, ఎఫ్‌ఎస్వో వెంకటసుబ్బయ్య బృందాన్ని అభింనందించారు.