నంబర్‌ వన్‌ దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రం

Published: Monday August 27, 2018
ఎలకా్ట్రనిక్స్‌ తయారీ రంగంలో రాష్ట్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఒకేచోట 14వేల మంది మహిళలు ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. అలాంటిది ఒకేచోట లక్ష మంది పనిచేస్తే ఎలా ఉంటుంది? à°† సంతోషం మాటలకు కూడా అందదు. à°ˆ దిశగా టీడీపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ కాదు కదా.. చిన్న ఎలకా్ట్రనిక్‌ వస్తువు తయారీ కూడా లేదు. ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌ తయారీలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానానికి ఎదిగింది. దేశీయ కంపెనీ సెల్‌కాన్‌ నుంచి అంతర్జాతీయ కంపెనీ ఫ్లెక్స్‌ట్రాన్‌ వరకు రాష్ట్రానికి వచ్చాయి. దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్‌ఫోన్లలో 3 మన రాష్ట్రంలోనే తయారయ్యే స్థాయికి చేరుకున్నాం. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎలకా్ట్రనిక్స్‌ తయారీ జోన్‌లో ఒకేచోట 14వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. త్వరలోనే రిలయన్స్‌ కంపెనీ కూడా రూ.15వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఏకంగా 25వేల మందికి ఉపాధి కల్పించనుంది. à°ˆ క్రమంలోనే ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ భారీ లక్ష్యాన్ని పెట్టుకొన్నారు. రాష్ట్రంలో తెలివైన, నైపుణ్యం కలిగిన యువత ఉండటంతో.. ఒకేచోట లక్ష మంది పనిచేసే మెగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. చైనాలోని షెన్జెన్‌, తైవాన్‌లోని షింజు నగరాల్లో లక్షమంది ఒకేచోట పనిచేసే కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీని ఆకర్షించేందుకు త్వరలో చైనా వెళ్తున్నారు.
 
ఆగమేఘాలపై అనుమతులు
రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడమే కాకుండా.. వాటికి ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చింది. తిరుపతి సమీపంలో రెండు ఎలకా్ట్రనిక్‌ తయారీ జోన్లను ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన భూమి, మౌలిక సదుపాయాలు కల్పించింది. సులభతర వ్యాపారంలో దేశంలోనే నంబరువన్‌à°—à°¾ ఉండటం, ఏపీకి వెళ్తే అన్ని అనుమతులు సత్వరం వచ్చేస్తాయి, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందనే భరోసా కల్పించారు. à°ˆ విఽధానం ఆకట్టుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలకా్ట్రనిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. తిరుపతి సమీపంలో రిలయన్స్‌ భారీ ఎలకా్ట్రనిక్స్‌ తయారీ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది.
 
రోజుకు 10లక్షల జియో ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, ఇతర వస్తువులను తయారు చేయబోతున్నారు. à°ˆ సంస్థను తీసుకొచ్చేందుకు à°—à°¤ ఏడాది అక్టోబరు నుంచీ మంత్రి లోకేశ్‌ తీవ్రంగా శ్రమించారు. త్వరలోనే కంపెనీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. డిక్సన్‌, కార్బన్‌ మొబైల్‌ లాంటి అనేక కంపెనీలు ఇప్పటికే తిరుపతి క్లస్టర్లలో ఉత్పత్తి ప్రారంభించాయి. తాజాగా హోలీటెక్‌ కూడా వచ్చి చేరనుంది. దేశంలోనే తొలిసారిగా ఏపీకి హోలీటెక్‌ ఎలకా్ట్రనిక్స్‌ తయారీ సంస్థ వచ్చింది. తిరుపతిలోని క్లస్టర్‌ రెండులో à°ˆ కంపెనీ కార్యక్రమాలు ప్రారంభించనుంది. రూ.1400కోట్ల పెట్టుబడితో 6వేల మందికి ఉపాధి కల్పించనుంది.