ఇక చెకింగ్‌ సమయంలో మొబైల్స్‌... బయట....

Published: Thursday August 30, 2018

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో చెకింగ్‌ నిమిత్తం బ్యాగ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌, టాబ్లెట్స్‌ను బయట పెట్టి చెక్‌ చేసి పంపిస్తారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు బ్యాగుల్లో నుంచి తీసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విమానాశ్రయ అధికారులు వాటిని తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దీని వల్ల చెకింగ్‌ పాయింట్ల దగ్గర ఆలస్యం కావడంతో క్యూలైన్‌ పెరిగిపోతూ ఉంది. ఇక మీదట చెకింగ్‌ కష్టాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయంలో చెకింగ్‌ పాయింట్‌ దగ్గర తమ బ్యాగుల్లో ఉన్న మొబైల్‌ ఫోన్స్‌, ఛార్జర్లు, వ్యాలెట్‌, పెన్నులు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కూడా అధికారులకు చూపించాల్సి రానుంది.

ఇటీవల కాలంలో విమానాశ్రయంలో చెకింగ్‌ చేసే సమయంలో కత్తులు బ్యాగుల్లో కనిపించడం వల్లే à°ˆ తరహా చెకింగ్‌ సిస్టమ్‌ను విమానాశ్రయంలో విధులు నిర్వర్తించే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పాటించనున్నట్లు à°“ ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు స్పందించారు. 'కొన్నిసార్లు ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్‌ చేసే సమయంలో అందులోని వస్తువుల విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. పెన్నులు ఆకారం వేరే విధంగా ఉంటే.. వాటిని కత్తులు అనుకొని కూడా చెకింగ్‌ చేస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే à°† బ్యాగును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అందులోని ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నింటినీ బయట పెట్టాల్సిందిగా ప్రయాణికులను కోరుతున్నాం. ఇలా చేయడం వల్ల హ్యాండ్‌ బ్యాగ్‌ను స్క్రీనింగ్‌ చేయడం వేగవంతంగా జరుగుతుంది' అని సదరు సీఐఎస్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు.

à°ˆ విధంగా చెక్‌ చేసేందుకు విమానాశ్రయాల్లో పీఈఎస్‌సీ పాయింట్లను ఏర్పాటు చేశారు. విమానాల్లోకి తీసుకెళ్లకూడని కత్తులు, కత్తెర వంటి వస్తువులను ప్రయాణికులు పొరపాటున తమ హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకొని వస్తే వాటిని తొలగించడం చేస్తున్నారు. ఒక్కోసారి తుపాకీ లైసెన్సు ఉన్న ప్రయాణికులు బుల్లెట్లను హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకొని వస్తుంటారు. అటువంటి వాటిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు గుర్తించి తొలగిస్తున్నారు. దిల్లీ, ముంబయి విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో పీఈఎస్‌సీ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.