పవన్‌పై నమ్మకం కలగలేదట..?

Published: Thursday August 30, 2018

రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలకు పురుడు పోస్తూ.. కొత్త రాజకీయాల సృష్టికి నాంది పలుకుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పట్ల పెద్దగా ఆశలు కనిపించడం లేదా? జనాలు ఆయనను పెద్దగా నెత్తిన పెట్టుకోవడం లేదా? ఆయనలో హీరో ని చూస్తున్నారు తప్పితే.. నాయకుడిని చూడడం లేదా? అంటే .. తాజా పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు కొండ్రు మురళీ మోహన్‌. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొండ్రు మురళి.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, వాస్తవానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ ఎత్తున పర్యటించాడు పవన్‌. ఇక్కడ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రశ్నించాడు. à°‡à°•à±à°•à°¡à°¿ నాయకులకు శాపాలు పెట్టాడు.

పెద్ద పెద్ద డైలాగులతో దంచికొట్టాడు. దీంతో ఉత్తరాంధ్రలో జనాలు పవన్‌కు ఫిదా అయిపోయి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే, అనతి కాలంలోనే పవన్ ప్రభావం ఇక్కడ పెద్దగా లేదనే పరిస్థితి తయారైంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువనాయకుడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కొండ్రు మురళి à°—à°¤ కొన్నాళ్లుగా పార్టీ మారాలని ప్రయత్ని స్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను వేరే పార్టీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. à°ˆ క్రమంలోనే ఇక్కడ పవన్ ప్రజా పోరాట యాత్ర స్టార్ట్ చేశారు. à°ˆ సందర్భంగా పలువురు నాయకులు పార్టీలో చేరతారని అంందరూ అనుకున్నారు.

ముఖ్యంగా కోండ్రు మురళి వంటి వారు పార్టీలో చేరతారని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఇక్కడ జనసేనలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొండ్రు మురళి కూడా అటు జనసేన, ఇటు వైసీపీలను కాదని టీడీపీని ఎంచుకున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలోనూ ఇదే చర్చగా మారింది. రాజాంలో మురళీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఇప్పటికే ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమావేశానికి కొండ్రు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. మురళీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇందుకోసం ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట రావును కలిసిన ఆయన... తాజాగా సీఎం చంద్రబాబునూ సంప్ర దించారు. కొండ్రును ఆహ్వానించేందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 31న టీడీపీలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. మొత్తంగా ఈ పరిణామం జనసేనలో నాయకత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.