బుక్కపట్నం చెరువులో జలపూజ పాల్గొననున్న చంద్రబాబు మరియు MLA బాలకృష్ణ

Published: Thursday January 11, 2018

గురువారం ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బుక్కపట్నం చెరువులో జలపూజలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నటుడుబాలకృష్ణ హాజరుకానున్నారు. జిల్లాలో అతి పెద్ద చెరువు.. బుక్కపట్నం చెరువు. చిత్రావతినదిపై రాయల కాలంలో నిర్మించిన ఈ చెరువు ఎప్పుడూ నీళ్లు లేక కనిపించేది. పదేళ్లకు పైగా నీళ్లు లేక ఎడారిలా తలపించింది. దీంతో చెరువు కింద ఆయుకట్టు రైతులు పంటలపై ఆశలు వదులుకుని పొరుగు ప్రాంతాలకు వలసబాట పట్టారు. ఈ తరుణంలో కృష్ణమ్మ కరుణించింది. బుక్కపట్నం చెరువు నిండింది. మూడు మండల కేంద్రాలకు మధ్యన చిత్రావతి నదిపై ఉన్న ఈ చెరువును 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన ఈ చెరువును దగ్గర నుంచి చూస్తే సముద్రాన్ని తలపిస్తోంది.

 

చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 59à°µ రోజు కొనసాగుతోంది. గురువారం గుండుపల్లి నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించనున్నారు. జగన్‌ చేపట్టిన పాదయాత్ర బుధవారం 800 కిలోమీటర్లకు చేరుకుంది.

 

తరచూ విధులకు వెళ్లిన భర్త రాత్రి ఆలస్యంగా వస్తున్నాడని మనస్తాపం చెందిన à°“ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. à°ˆ విషాద ఘటన మలక్‌పేట పోలీస్‌  స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

 

ఏపీ పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దంపతులిద్దరు శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేదపండితులు వారిని ఆశీర్వదించారు. ఈనెల 11వ తేదీ నుంచి 16 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. సంక్రాంతి పండుగను బంధువులతో జరుపుకునేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.