క్రిష్న నదిలో ఉల్లాసంగా సాగిన పడవ పోటీలు

Published: Monday January 15, 2018

కృష్ణానదిలో రెండురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి దివిసీమ సంప్రదాయ పడవల పోటీల సంబరాలు అంబరాన్ని అంటాయి. కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కర ఘాట్‌లోని  జరిగిన à°ˆ పోటీలు వీక్షించటానికి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సందర్శకులు ప్రత్యేక బస్సులలో తరలివచ్చారు. ఆదివారం డ్రాగన్‌, మెడ్డుడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కేరళ తరహాలో తొలిసారిగా నిర్వహించిన డ్రాగన్‌ పోటీలకు వీక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. à°ˆ పోటీలు నదికి ఉత్తరవైపు నుంచి దక్షిణం వైపుగా కిలోమీటర్‌ దూరంలో నిర్వహించారు. ఒక్కొక్క రౌండ్‌లో ఐదు పడవలను నిలిపి పోటీలు నిర్వహించారు. జలక్రీడల, పోలీస్‌శాఖ పర్యవేక్షణలో పోటీలు ఘనంగా జరిగాయి. పోటీలను ఆర్గనైజింగ్‌ కమిటీ నిర్వాహకులు నాగిడి సాంబశివరావు, కె.వీరరాఘవయ్య, కొల్లు నాని, పీతా సుబ్బారావు, లంకే శ్రీనివాస ప్రసాద్‌, వాడపల్లి భిక్షం, అండ్రాజు లోకేష్‌, తిరుమలశెట్టి మస్తానరావు, నాగిడి తాతారావు పర్యవేక్షించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేదిక వద్ద నిర్వహించిన పడవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించటానికి ప్రజలు ఘాట్‌ వద్ద పోటెత్తారు. అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.