పాక్ ని కట్టడి చెయ్యాలి : రావత్

Published: Monday January 15, 2018

జమ్మూకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పే దిశగా మిలటరీ ఆపరేషన్లు చేపట్టేందుకు రాజకీయ కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని సూచించారు. à°† రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైనిక దళాలు పరిస్థితిని నియంత్రించేందుకు కొత్త వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిలిపివేసేలా పాక్‌కు సెగపుట్టించేందుకు అవకాశం ఉందని నొక్కిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు à°•à° à°¿ à°¨ వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేశారు. ‘à°† దిశగా రాజకీయ à°•à°¾ ర్యాచరణకు ఇతర అన్ని కార్యాచరణలూ ఒకదానికొకటి తోడైనప్పుడే కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పగలం. అందుకు పొలిటికో-మిలిటరీ వైఖరిని మనం అనుసరించాలి’ అని రావత్‌ పేర్కొన్నారు. ‘కశ్మీర్‌ à°…à°‚ శాన్ని పరిష్కరించే యంత్రాంగం లో మిలటరీ à°’à°• భాగం మాత్ర మే. రాష్ట్రంలో హింసను సృష్టిస్తున్న ఉగ్రవాదులు, తీవ్రవాదుల పనిపట్టడం, ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేవారి సంఖ్య పెరగకుండా అడ్డుకోవడమే మా పని’ అని పేర్కొన్నారు