జన్మభూమి అవార్డుల ప్రదానం

Published: Friday January 19, 2018

5వ విడత జన్మభూమి అవార్డుల ప్రదానం కోసం వెలగపూడి సచివాలయానికి సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధమైంది. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు జిల్లాల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డులు అందజేయనున్నారు. శుక్రవారం సాయంత్రం జరగబోయే సభ కోసం ఏర్పాట్లు చేశారు.