‘నోటా’కు తమిళనాడులో యు సర్టిఫికెట్‌

Published: Friday October 05, 2018
 ‘‘మా ‘నోటా’కు తమిళనాడులో యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. అదేంటి? అని అనుకున్నా. కానీ ఇక్కడ మన వాళ్లు తెరపై నన్ను చూడగానే ‘యు/à°Ž’ ఇచ్చారు. అప్పుడు మనశ్శాంతి కలిగింది. సంబరపడ్డాను’’ అని అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన నటించిన ‘నోటా’ శుక్రవారం విడుదల కానుంది. à°ˆ సినిమా గురించి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒకప్పుడు నేను, తరుణ్‌ భాస్కర్‌ కలిసి ‘పెళ్లిచూపులు’ స్ర్కిప్ట్‌తో చాలా మంది చుట్టూ తిరిగాం. అప్పుడు మమ్మల్ని నమ్మి రూ.60లక్షలు పెట్టడానికి చాలా మంది వెనకాడారు. మాలాంటి సిన్సియర్‌ వాళ్లకోసమే నేను ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టాను. నేను నిర్మాతగా సినిమాలు ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయాలి? అనే ఆలోచన నుంచి పుట్టిందే కింగ్‌ ఆఫ్‌ à°¦ హిల్‌. దేవరకొండను ఇంగ్లిష్‌లో అలా పెట్టా. వ్యక్తిగతంగా ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కోవడం నాకు నచ్చదు. ‘నోటా’లో తెలుగు వాళ్లకన్నా తమిళ ప్రజలకు అర్థమయ్యే అంశాలు చాలా ఉన్నాయి. జయలలిత హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి మాత్రమే నేను తమిళ రాజకీయాలను ఫాలో అయ్యాను. అంతకు ముందు జరిగిన కొన్ని అంశాలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నానంతే. తమిళ వాళ్లు తెలుగు సినిమాలను చాలా గొప్పగా చూస్తున్నారు. ‘నోటా’ కూడా అలాంటి చిత్రమే అవుతుందనే నమ్మకం ఉంది. à°ˆ à°•à°¥ ఏ రాష్ట్రానికైనా సరిపోతుంది. అయిష్టంగా, బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిన à°“ యువకుడు... చుట్టూ ఉన్న నిజమైన రాజకీయనాయకుల మధ్య ఎలా నిలబడగలిగాడు అనేదే à°•à°¥’’ అని అన్నారు. సినీ ప్రయాణాన్ని గురించి తరచి చూసుకుని, ఆలోచించి, ఆస్వాదించేంత సమయం లేదనీ.. పబ్లిక్‌ మధ్య ఉన్నప్పుడు ఆనందంగానూ, భయంగానూ ఉంటుందని ఆయన తెలిపారు. ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ లీక్‌ అయినప్పుడు చాలా నెర్వస్‌à°—à°¾ ఫీలయినట్టు తెలిపారు. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌లో ఉందని, à°† తర్వాత క్రాంతి దర్శకత్వంలో à°“ సినిమా ఉందని, ‘నోటా’ రిజల్ట్‌ని బట్టి మరో ద్విభాషా చిత్రాన్ని గురించి ఆలోచించాలని అన్నారు. ఇటీవల లీక్‌ అయిన ఫొటోల్లో తన ఫ్యామిలీతో, à°“ అమ్మాయితో ఉన్నది తానేనని, అవతలివారికి ఫోకస్‌లో ఉండటం నచ్చదని తెలిసినప్పుడు వారి ప్రైవసీ వారికివ్వాలని, తను చాలా మంచి అమ్మాయి అని విజయ్‌ చెప్పారు.
 
కేటీఆర్‌ అంటే చాలా ఇష్టం
‘‘తమ పార్టీకన్నా నోటా బెటర్‌ ఆప్షన్‌ అవుతుందని అనుకునేవారే మా ‘నోటా’ను చూసి భయపడతారు. తప్పు చేసిన పార్టీలకే భయం ఉంటుంది. మిగిలిన పొలిటికల్‌ పార్టీలన్నీ తమని కాదనుకుని సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తాయి’’ అని విజయ్‌ దేవరకొండ చెప్పారు. ‘‘‘నోటా’లో హీరో పాత్ర కోసం మేం కేటీఆర్‌ స్టైల్‌ని ఫాలో అయ్యాం. డిటో టు డిటో ఆయన లుక్స్‌ కొన్ని దింపాం. నాకు వ్యక్తిగతంగా ఆయనంటే చాలా ఇష్టం. మొత్తం ఖాదీ ఖాదీ అన్నట్టు కాకుండా, షర్ట్స్‌ వంటివి వేసుకుని యంగ్‌à°—à°¾ ఉంటారు. అందుకే ఆయన్ని ఫాలో అయ్యాం. ఇప్పుడు తెలంగాణ సిస్టమ్‌ నాకు చాలా నచ్చుతోంది. కేటీఆర్‌ను కలిసిన తర్వాత ఆయన కేవలం ఫొటోలకు ఫోజులిచ్చే వ్యక్తి కాదని అర్థమైంది. అలాంటి రాజకీయనాయకుడిని చూడటం నాకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది రాజకీయనాయకులు ఏం చేసినా ఫొటోల కోసమే చేస్తున్నట్టుంటారు. ఉదాహరణకు ప్లాస్టిక్‌ మానేద్దామంటే ప్రెస్‌ని పిలిచి ప్లాస్టిక్‌ మానేద్దామని చెప్పి ఫొటోలు తీసుకుంటారు. మరుసటి రోజు ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీళ్లు తాగుతుంటారు. కానీ కేటీఆర్‌ అలాంటి పనులు చేయరు. చెప్పినదాన్ని మించి ఆలోచిస్తారు. ‘మనం పనిచేసేది ఫొటోల కోసం కాదురా.. మనం దాన్ని మించి ఆలోచించాలి. ఆచరించాలి’ అని అంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ‘‘నా చిన్నప్పుడు చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని ఇష్టపడేవాడిని. హైదరాబాద్‌ బూమ్‌ ఆయన హయాంలోనే వచ్చింది. ప్రభుత్వోద్యోగులు ఆయన హయాంలో చాలా రకాలుగా ఫిర్యాదులు చేసేవారు. అప్పుడే ‘చెక్‌ ఇన్‌.. చెక్‌ ఔట్‌’ వంటివి ప్రభుత్వ కార్యాలయాల్లో మొదలయ్యాయి. నేను à°† విషయాలను గమనించేవాడిని. ఎవరైనా స్ట్రిక్ట్‌ à°—à°¾ ఉంటే నాకు చాలా ఇష్టం’’ అని అన్నారు.