కఠినంగా వ్యవహరించండి పోలీసులను అదేశించిన సీఎం చంద్రబాబు

Published: Saturday January 20, 2018

గుంటూరు : జిల్లాల్లో ఎక్కడా కూడా రౌడీషీటర్లు నేరాలకు పాల్పకుండా వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఎస్పీలను ఆదేశించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌తో పాటు వారి కదలికలపై కూడా నిఘా ఉంచి చట్ట పరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బెల్టుషాపులు ఉంటే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అవసరం ఉంటే సంబంధిత మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. గంజాయి, గుట్కా, ఖైనీ వంటి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే అన్ని జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకుని మత్తు పదార్ధాల అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు. . అదే విధంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ఘటనలపై సంబంధిత చట్టాలను ప్రయోగించి మహిళలకు తగిన రక్షణ, న్యాయం చేయాలని ఆదేశించారు.

 

రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టండి

రోడ్డు ప్రమాదాల మరణాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని వాటిని పూర్తిగా నియంత్రించేందుకు ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బ్లాక్‌స్పాట్స్‌ గుర్తింపుతో పాటు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలన్నారు. à°ˆ విషయంలో అవసరమైతే నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. అదే విధంగా నేరాలను నియంత్రించేందుకు దొంగతనాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.