నా ఆలోచనలు నచ్చిన వాళ్లతో కలసి ప్రయాణించడానికి సిద్ధం

Published: Sunday October 07, 2018
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ సాధనే తన లక్ష్యమని వెల్లడించారు. ‘‘ప్రజలకు రాజకీయాల ద్వారానే విస్తృతంగా సేవ చేయడానికి సాధ్యం అవుతుంది. త్వరలోనే నిర్దిష్ట ప్రణాళికతో రాజకీయ ప్రవేశం చేస్తాను’’ అని పేర్కొన్నారు. రైతులు, గ్రామాల సమస్యలపై రాష్ట్రంలో 13 జిల్లాల పర్యటనను ఆయన ముగించుకొన్నారు. à°ˆ సందర్భంగా శనివారం తిరుపతిలో ‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు. రాజకీయాల గురించిన తన ఆలోచనలను, గెలుపు తీరుతెన్నులను à°ˆ సందర్భంగా పంచుకొన్నారు.
 
‘‘ఎన్నికల్లో 65 శాతంమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో సగం మంది డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించాలి. అసలు ఓటింగ్‌లో పాల్గొనని 35 శాతంలో సగం మందినైనా ఎన్నికలపై చైతన్యవంతం చేయాలి. à°ˆ రెండు పక్షాలను కలిపితే 50శాతంపైగానే ఉంటారు. వీరి మద్దతును కూడగట్టుకొంటే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టం కాదు. తేలిగ్గానే మెజారిటీని సాధించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. తనలాంటి ఆలోచనా విధానాలు ఉన్నవారు కలిస్తే, వారితో కలసి ప్రయాణం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. డబ్బు ఇవ్వకుండానే రాజకీయాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జిల్లాల పర్యటనలో గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారాలతో à°“ నివేదికను తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తామని à°’à°• ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తే రైతులకు రుణమాఫీ, సబ్సిడీల అవసరం ఉండదన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలు రావాలని, ధరల స్థిరీకరణ జరగాలని చెప్పారు.