విజయవాడ నుండి అంతర్జాతీయ సర్వీసులు : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు

Published: Saturday January 20, 2018

అమరావతి:  రాజధాని ప్రాంతం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి విమాన అనుసంధానం శుభపరిణామమని, త్వరలో విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి అశోక్‌ గజపతిరాజు అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వారంలో మంగళ, శుక్ర, ఆదివారాలు à°ˆ సర్వీసు ఇక్కడి నుంచి ఉదయం 9.45 à°—à°‚à°Ÿà°² సమయంలో ముంబైకి బయలుదేరుతుంది. విజయవాడ ఎయిర్‌పోర్టులో మరికొద్ది రోజుల్లో ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలు కూడా ఏర్పాటవుతాయని, ఇది జరిగిన తర్వాత ఇదే సర్వీసు అంతర్జాతీయ సర్వీసుగా దుబాయి, షార్జాలకు వెళుతుందని విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. ఎన్నో అవరోధాలను అధిగమించి విజయవాడ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయటం జరుగుతోందని రాజు à°ˆ సందర్భంగా అన్నారు. ముంబై విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉందని, అక్కడ స్లాట్‌ దొరకటం చాలా కష్టంగా మారిందని చెప్పారు. అయినప్పటికీ విజయవాడ నుంచి ముంబైకి à°’à°• విమాన సర్వీసును నడిపించేందుకు à°’à°• స్లాట్‌ ఇప్పించటం జరిగిందన్నారు.

 

ముంబై నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు విమాన కనెక్టివిటీ ఉంటుందని, చాలా సులభంగా విదేశాలకు వెళ్ళవచ్చునని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా రావటం మంచి విషయమన్నారు. రన్‌వే విస్తరణ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయని, డిసెంబరు నాటికి పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. రన్‌వే విస్తరణ పూర్తికాగానే పూర్తిగా అంతర్జాతీయ సర్వీసులకు విజయవాడ ఎయిర్‌పోర్టు సిద్ధమౌతుందని చెప్పారు. గల్ఫ్‌ దేశాలతో పాటు ఇతర విదేశాలకు ఇక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి స్వదేశీ విమానాలు సిద్ధంగా ఉన్నాయని, విదేశీ విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. రన్‌వే విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి à°ˆ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. మరో నెల రోజుల్లో విజయవాడ విమా నాశ్రయం నుంచి కార్గో సేవలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.