రెండు రోజుల్లో విద్యుత్‌ పునరుద్ధరణ:లోకేశ్‌

Published: Tuesday October 16, 2018
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, రెండు రోజుల్లో పట్టణాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా అవుతుందని మంత్రి లోకేశ్‌ చెప్పారు. మందసలో రెండు రోజులుగా మకాం వేసిన ఆయన ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై దిశా నిర్దేశం చేస్తున్నారు. సోమవారం అధికారులతో సమీక్ష అనంతరం లోకేశ్‌ విలేకర్లతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు అందిస్తున్నామని, ఇప్పటికే నిత్యావసరాలు గ్రామాలకు చేరుకున్నాయని, పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను నియమించామని, రెండు రోజుల్లో నివేదికలు అందుతాయని తెలిపారు. సాధారణ పరిస్థితులు వచ్చేదాక ఇక్కడే ఉంటామన్నారు.
 
మరోవైపు మంత్రులు నారాయణ, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సుజయకృష్ణ రంగరావు, కొల్లు రవీంద్ర, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, చిన్న రాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తున్నారు. కొందరు మంత్రులు స్థానికంగా మకాం వేసి బాధితుల సమస్యలు తెలుసుకుంటుండగా, మరికొందరు పర్యటించి ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తున్నారు. పురపాలకశాఖ మంత్రి కె.నారాయణ పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో బైక్‌పై పర్యటించారు. ప్రజలతో కలసి రోడ్డు పక్కనే అల్పాహారం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.