ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలానికి 578 మంది : బీసీసీఐ

Published: Monday January 22, 2018

జనవరి 27, 28 తేదీల్లో జరగనున్న వేలానికి సన్నాహాలు భారీ ఎత్తున మొదలైయ్యాయి. ఇప్పటికీ వరకు 1000మందికి పైగా ప్లేయర్లు à°ˆ వేలానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే వారిలో కేవలం 578 మందిని మాత్రమే బీసీసీఐ ఆమోదించింది. à°ˆ వేలంలో పాల్గొనే ప్లేయర్లు అత్యధిక ధర రెండు కోట్ల నుంచి ఇరవై లక్షల వరకు ప్రకటించుకున్నారు.

అత్యంత ఆసక్తి రేపుతున్న ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలానికి సమయం దగ్గరపడుతోంది. à°ˆ నెల 27, 28à°µ తేదీల్లో జరిగే వేలం కోసం ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ సహా మొత్తం 16 మంది క్రికెటర్లను బీసీసీఐ 'మేటి' ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కూడా మేటి జాబితాలో ఉన్న విదేశీ స్టార్లు.

à°“ దాడి కేసులో అభియోగాలు నమోదైనప్పటికీ స్టోక్స్‌కు దేశం తరఫున ఆడేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గేల్‌, పొలార్డ్‌, యువరాజ్‌, సింగ్‌, గంభీర్‌, ధావన్‌, మాక్స్‌వెల్‌, రహానె, హర్భ్‌జన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, డ్వేన్‌ బ్రావో, డుప్లెసిస్‌, కేన్‌ విలియమ్సన్‌లు ఇతర మేటి ఆటగాళ్లు. స్థాయిని బట్టి ఆటగాళ్లను మొత్తం ఎనిమిది విభాగాల్లో ఉంచింది. అంతర్జాతీయ ఆటగాళ్ల కనీస ధర రూ.2 కోట్లు, రూ.1.5 కోట్లు, రూ.1 కోటి, రూ.75 లక్షలు, రూ.50 లక్షలుగా.. అరంగేట్రం చేయని ఆటగాళ్ల కనీస ధర రూ.40 లక్షలు, రూ.30 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయించారు.

16 మంది మేటి క్రికెటర్లను à°Žà°‚1, à°Žà°‚2 విభాగాలు విభజించారు. అశ్విన్‌, ధావన్‌, డుప్లెసిస్‌, గేల్‌, పొలార్డ్‌, రహానె, స్టార్క్‌, స్టోక్స్‌ à°Žà°‚1లో ఉన్నారు. డ్వేన్‌ బ్రావో, గంభీర్‌, షకిబ్‌, మాక్స్‌వెల్‌, రూట్‌, హర్భజన్‌, యువరాజ్‌, కేన్‌ విలియమ్సన్‌ à°Žà°‚-2లో ఉన్నారు. ఏ లెక్క ప్రకారం à°ˆ జాబితాలను రూపొందించిందో బీసీసీఐ వివరించలేదు. కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్న ఆటగాళ్ల జాబితాలో మొత్తం 36 మంది ఉండగా అందులో 13 మంది భారత క్రికెటర్లు ఉండటం విశేషం.

మరో 32 మంది రూ.1.5 కోట్ల జాబితాలో, 31 మంది రూ.1 కోటి జాబితాలో ఉన్నారు. కృనాల్‌ పాండ్య, పృథ్వీ à°·à°¾, కమలేశ్‌ నాగర్‌కోటి వంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయని ఆటగాళ్ల విభాగంలో ఉన్నారు. మొత్తం మీద భారత్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఆటగాళ్లు 62 మంది, అరంగేట్రం చేయని స్థానిక ఆటగాళ్లు 288 మంది వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.