సిక్కోలు పునర్నిర్మాణానికి మహోద్యమం

Published: Tuesday October 23, 2018
‘ఉద్యానవనం లాంటి ఉద్దానం.. తితలీ తుఫాను తెచ్చిన నష్టంతో దశాబ్దాలు వెనక్కి వెళ్లింది. నిన్నటివరకు కిడ్నీ వ్యాధి బాధలే అనుకుంటే పులిమీద పుట్రలా ఇప్పుడు తుఫాను విలయతాండవం ఉద్దానాన్ని అధ్వానంగా మార్చేసింది. అక్కడే కాదు.. శ్రీకాకుళం జిల్లాలో అనేక గ్రామాల్లో తుఫాను పెను విషాదాన్ని మిగిల్చింది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు, తోటలు కుప్పకూలాయని.. వలలు, పడవలు కొట్టుకుపోయి మత్స్యకారులు కకావికలమయ్యారని వాపోయారు. శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. అక్కడి సోదరసోదరీమణులకు వీలైనంత ఆసరా ఇద్దామని తెలిపారు. నెలవారీ మన ఖర్చుల నుంచి కొంత సొమ్ము విరాళంగా ఇద్దామని ప్రతిపాదించారు. తద్వారా తుఫాను బాఽధితులకు ఓదార్పునిచ్చి.. వారి బాగుకు భరోసానిద్దామన్నారు. à°ˆ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. లేఖ పాఠమిదీ..
 
నష్టం అపారం..
‘తితలీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అల్లకల్లోలం చేసింది. తుఫాను తీవ్రత తెలిసిన వెంటనే యావత్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణనష్టం తగ్గించగలిగాం. కానీ 165 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల బీభత్సం వల్ల ఆస్తి నష్టం నివారించలేకపోయాం. à°ˆ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు తీరని బాధల్లో ఉన్నారు. కళ్ల ముందే ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. 40 వేల కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. 700 కిలోమీటర్ల రోడ్లు, 365 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. 1.59 లక్షల ఎకరాల వరి, 4,543 ఎకరాల కొబ్బరి, 17,589 ఎకరాల జీడిమామిడి తోటలు, 968 ఎకరాల à°…à°°à°Ÿà°¿ పంట ధ్వంసం అయ్యాయి. 34,848 ఇళ్లు పూర్తిగా, 12,397ఇళ్లకు పాక్షికంగా నష్టం జరిగింది. మొత్తం రూ.3,428 కోట్ల నష్టం వాటిల్లింది. కొబ్బరి, జీడిమామిడి తోటలతో పాటు, వరి తదితర పంటలు కళ్లముందే కూలిపోవడం చూసి రైతుల దుఖం వర్ణనాతీతం. కన్నబిడ్డల్లా చూసుకున్న పచ్చని తోటలు నిలువునా కుప్పకూలాయి. వలలు, పడవలు కొట్టుకుపోయి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. నష్టం అపారం. కానీ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే జీవితమే లేదు. à°’à°• రైతు బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కష్టాన్ని చూసి చలించిపోయాను. వెంటనే రంగంలోకి దిగాను. à°ˆ సంక్షోభాన్ని అధిగమించేందుకు వ్యూహరచన చేశాను. సచివాలయాన్నే అక్కడకు తరలించాను.’