ఆ భూములపై వేగంగా స్పందించండి

Published: Friday October 26, 2018
‘‘నెలరోజుల లోపు చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలి. à°ˆ క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగడానికి వీలులేదు. పైసా అవినీతికి తావులేకుండా à°ˆ ప్రక్రియను పూర్తిచేయండి’’ అంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. లక్షల మంది జీవితాలతో ముడిపడిన à°ˆ సమస్యను కలెక్టర్లు తీవ్రంగా పరిగణించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో మొదలయిన తొలిరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. à°ˆ సందర్భంగా చుక్కల భూముల అంశాన్ని కీలకంగా ఆయన ప్రస్తావించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా, గ్రామ సభల ద్వారా చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. ‘‘పాలసీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే.. ఆయా శాఖలకు ప్రతిపాదించండి. కానీ, à°ˆ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మీదే. ఎక్కడైనా పట్టాలు ఇవ్వకపోతే అందుకు కారణాల్ని తెలుసుకొని, అక్కడికక్కడే à°† సమస్యను నివృత్తి చేయండి’’ అని కలెక్టర్లను ఆయన నిర్దేశించారు. ఆర్టీజీ విభాగం à°ˆ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
 
à°† కథనాలకు హెడ్‌వోడీలదే బాధ్యత
వివిధ శాఖలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలు, కథనాలను సమాచార పౌర సంబంధాల శాఖ సెక్రటరీ రామాంజనేయులు సమావేశం దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో పాస్‌బుక్‌లో వస్తున్న తప్పుల వల్ల బ్యాంకుల నుంచి రుణం రాక ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు పత్రికల్లో వస్తున్నాయని రామాంజనేయులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖపై పలు వ్యతిరేక కథనాలు వస్తున్నాయని, ఆసుపత్రుల్లో డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండటం లేదని పత్రికలు ప్రముఖంగా రాస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పలు కథనాలు వచ్చిన విషయం ప్రస్తావించారు.