ఇంటింటికీ కుళాయి : పంచాయతీరాజ్‌శాఖ

Published: Tuesday January 23, 2018

ఆంధ్రప్రదేశ్ :  à°‡à°‚à°Ÿà°¿à°‚à°Ÿà°¿à°•à±€ కుళాయి నీటి సరఫరా లక్ష్యంగా తొలివిడతగా రూ.15,730 కోట్లతో నీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.9,400 కోట్లతో ఐదు జిల్లాల్లో యాన్యుటీ విధానంలోనూ, మరో రూ.6330 కోట్లతో 8 జిల్లాల్లో బ్యాంకు రుణం ద్వారా చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. అంచనాలు రూపొందించాలని పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించింది.

 
రాష్ట్రవ్యాప్తంగా 48,363 ఆవాస ప్రాంతాల్లో 3.65 కోట్ల జనాభాకు కుళాయి ద్వారా తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం సుమారు రూ.22 వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వ్యక్తికీ 70 లీటర్ల నీటిని సరఫరా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు.
 
ఇందులో à°•à°¡à°ª, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు యాన్యుటీ విధానంలో విదేశీ సంస్థల నుంచి రుణం సేకరించి నీటి వనరులు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,350 కోట్లు, యాన్యుటీ ఏజెన్సీలు రూ.7050 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మిగిలిన 8 జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ద్వారా రూ.12600 కోట్ల రుణాలు సమీకరించాలని భావించారు.