వద్దన్నా ప్రేమించిందని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి

Published: Tuesday October 30, 2018
దళిత యువకుడిని ప్రేమించిందన్న కారణంతో తన కుమార్తెని కన్న తండ్రే కడతేర్చాడు. గొంతు నులిమి, ఆపై తాడు బిగించి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రహస్యంగా తగలబెట్టాడు. అందరినీ కలవరపరిచిన à°ˆ కులోన్మాద హత్య ఆదివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పందరబోయిన ఆవులయ్య బీఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌à°—à°¾ పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. ఆవులయ్య, అంజనమ్మకు ముగ్గురు పిల్లలు. వారిలో రెండో కుమార్తె ఇంద్ర కళావతి అలియాస్‌ ఇంద్రజ (20). తమ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ చైతన్యను ఐదేళ్లుగా ఆమె ప్రేమిస్తోంది. గిద్దలూరులో ఇంటర్మీడియట్‌ చదివే సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో వారిద్దరి ప్రేమను బీసీ వర్గానికి చెందిన అమ్మాయి కుటుంబం అంగీకరించలేదు. à°ˆ క్రమంలో ఆవులయ్య.. నాలుగేళ్ల క్రితం ఇంద్రజను కళాశాల మాన్పించాడు. తమ కుమార్తెని కలవొద్దు.. మాట్లాడొద్దు అంటూ పలుసార్లు చైతన్యను హెచ్చరించాడు. కాదంటే అంతుచూస్తానని బెదిరించాడు. దీనిపై ఆవులయ్యపై చైతన్య గిద్దలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
à°ˆ నేపధ్యంలో నెలక్రితం ఇంద్రజ, చైతన్య తమ కుటుంబాలకు చెప్పకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆవులయ్య ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చైతన్య తిరిగి గ్రామానికి వచ్చేయగా, ఇంద్రజను మాత్రం ఆవులయ్య హైదరాబాద్‌లోనే ఉంచాడు. ప్రేమ వ్యవహారం కట్టిపెట్టాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఇంద్రజ అంగీకరించలేదు. ఆయన తీరుతో మనస్తాపం చెందిన ఆమె.. రోజుల తరబడి భోజనం మానేసింది. à°ˆ క్రమంలో వారం క్రితం కుమార్తెను తీసుకొని ఆవులయ్య తన గ్రామం చేరుకొన్నాడు. à°Žà°‚à°¤ బెదిరించినా ఆమె వైఖరి మారకపోవడంతో ఆవులయ్య ఉన్మాదిలా మారాడు.
 
ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రస్తున్న ఇంద్రజ గొంతు నులమడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆతర్వాత తాడు తెచ్చి ఆమె మెడకు ఉరేశాడు. ఇంద్రజ చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమె పడుకొన్న మంచంతోసహా మృతదేహాన్ని గ్రామ శివార్లలోకి తీసుకెళ్లాడు. తన కుటుంబ సభ్యుల సహకారంతో కిరోసిన్‌ పోసి కాల్చివేశాడు. మృతదేహం కాలడాన్ని గుర్తించిన గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆవులయ్యతోపాటు ఆయన భార్య అంజనమ్మ, కుమారుడు మహేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇంద్రజ హత్య విషయం తెలియగానే చైతన్య కుటుంబం భయంతో ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది