ప్రమాదవశాత్తు సముద్రంలో పడిన గూడ్స్‌ వ్యాన్‌

Published: Monday November 12, 2018
కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదవశాత్తూ గూడ్స్‌ వ్యాన్‌ అదుపుతప్పి సముద్రంలో పడి డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కాకినాడలోని గొడారిగుంట సీతారామనగరానికి చెందిన గోగాడ సత్యారావు (54) వ్యాన్‌ డ్రైవర్‌à°—à°¾ పనిచేస్తుంటాడు. అతడికి భార్య, మంగ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్లుగా కాకినాడ రూరల్‌ మండలం ఆటోనగర్‌లోని భరతమాతా ఐస్‌ఫ్యాక్టరీలో వ్యాన్‌ డ్రైవర్‌à°—à°¾ పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఫిషింగ్‌ హార్బర్‌కు ఐస్‌ను రవాణా చేస్తుంటాడు.
 
వ్యాన్‌ను ఐస్‌లోడ్‌తో ఆదివారం తెల్లవారు జామున ఫిషింగ్‌ హార్బర్‌లోని బార్‌జట్టీ వద్దకు తీసుకెళ్ళాడు. అప్పటికి ఇంకా చీకటిగా ఉంది. వ్యాన్‌ను బ్యాక్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపుతప్పి సముద్రంలో పడిపోయింది. సత్యారావుకు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక డ్రైవింగ్‌ సీటులోనే మృతి చెందాడు. పోర్టు పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో రాజశేఖర్‌ ఆధ్వర్యంలో à°—à°œ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 1 à°—à°‚à°Ÿ సమయంలో వ్యాన్‌తో సహా సత్యారావు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోర్టు ఎస్‌ఐ నరసింహమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.