రిలయన్స్‌ను మేమే ఎంచుకున్నాం 30 భాగస్వామ్య కంపెనీల్లో అదీ ఒకటి

Published: Wednesday November 14, 2018
‘భారత ప్రభుత్వ సూచన ప్రకారమే రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను రాఫెల్‌ ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఎంపిక చేశం’.. కొన్నాళ్ల క్రితం ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు మెక్రాన్‌ చేసిన ప్రకటన! ‘ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న స్వేచ్ఛ మాకుంది.రిలయన్స్‌ ఒక్కటే కాదు.. మాకు 30 కంపెనీలతో ఆఫ్‌సెట్‌ భాగస్వామ్యం ఉంది’.. ఇప్పుడు దసో సీఈవో ఎరిక్‌ ట్రాపీర్‌ స్పష్టీకరణ!
నాగపూర్‌లో అనిల్‌ కంపెనీకి స్థలం ఉన్నందు నే à°† సంస్థతో కాంట్రాక్టు కుదుర్చుకున్నామంటూ దసో సీఈవో అసత్యాలు చెప్పారని, రిలయన్స్‌ కంపెనీలో దసో సంస్థ అప్పనంగా రూ.284 కోట్లు జమ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆరోపించారు. విచారణజరిపితే ప్రధాని మోదీ తప్పించుకోలేరని కూడాచెప్పారు. à°ˆ నేపథ్యంలో ఎరిక్‌ ట్రాపీర్‌ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టు ఏడేళ్లు ఉంటుంది. ఇందు లో తొలి మూడేళ్లు మేం ఎవరితో భాగస్వామిగా ఉంటామన్నది మా ఇష్టం. రిలయన్స్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మాకుంది. ఇది పూర్తిగా మేం తీసుకున్న నిర్ణయం. రిలయన్స్‌కు మేమేం అప్పనంగా డబ్బులు ఇవ్వడంలేదు. ఇద్దరం కలిసి 49:51 నిష్పత్తిలో జాయింట్‌ వెంచర్‌లో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టాలి. రూ.40 కోట్లు జాయింట్‌ వెంచర్‌లో జమ చేశాం. రిలయన్స్‌ కూడా అంతే జమచేయాలి. మేం 30కంపెనీలతో ఆఫ్‌సెట్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. మొత్తం ఆఫ్‌సెట్‌ విలువలో రిలయన్స్‌కు అప్పగించింది 10 శాతమే. 2012 నాటి ఒప్పందంతో పోల్చితే రాఫెల్‌ విమా నం ధర 9% తగ్గింది. తొలి ఒప్పందంలో 18 విమానాలను అప్పగించాల్సి ఉంది. ఇప్పుడు 36 విమానాలను ఇస్తున్నాం. రెండుప్రభుత్వాల మధ్య ఒప్పందంతో ధరను 9% తగ్గించాం. నేను అబద్ధాలు చెప్పను. నా స్థానంలో మీరున్నా, à°’à°• సీఈవోగా అసత్యాలు చెప్పరు.
 
రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం మిత్రుల తో అబద్ధాలు చెప్పిస్తోందని లెఫ్ట్‌ పార్టీలు విమర్శించాయి. à°ˆ డీల్‌లో రూ.59 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ట్వీట్‌ చేశారు. డీల్‌లోని అవకతవకలు జేపీసీ(సంయుక్త పార్లమెంటరీ కమిటీ) విచారణతో వెలుగులోకి వస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి à°¡à°¿.రాజా పేర్కొన్నారు.
 
18 విమానాలను ‘రెడీ టు ఫ్లై’ దశలో కొనడం, మిగిలిన 108 భారత్‌లో తయారు చేయాలనుకోవడం... ఇదంతా ‘స్మూత్‌’à°—à°¾ సాగలేదు. మరోవైపు... భారత వైమానిక దళానికి అత్యవసరంగా 36 యుద్ధ విమానాలు అవసరమని ఫ్రాన్స్‌ను భారత్‌ కోరింది. చివర్లో హాల్‌ కూడా ఆఫ్‌సెట్‌ భాగస్వామ్యంపై ఆసక్తి లేదని తెలిపింది. దీంతో మేం రిలయన్స్‌నే కొనసాగించాం.