అరకు అంతర్జాతీయ గుర్తింపు పర్యటక శాఖ మంత్రి అఖిలప్రియ

Published: Friday November 17, 2017
అరకు: పర్యటకంగా అరకులోయకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు à°† శాఖ మంత్రి అఖిలప్రియ చెప్పారు. అరకులోయలో పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరకు బెలూన్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో గురువారం రాత్రి ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే క్రమంలోనే బెలూన్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రూ.2.5 కోట్ల వ్యయంతో 13 దేశాల నుంచి నిర్వాహకులను తీసుకువచ్చామన్నారు. చింతపల్లి ప్రాంతంలోని లంబసింగిలో పర్యటకుల సౌకర్యార్థం కాటేజీలను నిర్మిస్తున్నామన్నారు. అరకులోయలో హెల్త్‌ టూరిజం అభివృద్ధికి వీలుగా ప్రభుత్వానికి డీపీఆర్‌వో అందజేసినట్లు చెప్పారు. బెలూన్‌ ఫెస్టివల్‌ని మరో రెండు రోజులు పొడిగించాలని నిర్వాహకులను కోరడం జరిగిందన్నారు. శుక్రవారం బెలూన్‌ ఫెస్టివల్‌ కొనసాగుతుందన్నారు. పర్యటక శాఖ ఈడీ శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు.