పరిశ్రమల వేదికగా రాయలసీమ

Published: Wednesday January 24, 2018

చాలా ఏలుగా  నీరులేక నిస్తేజమైన రాయలసీమ నేడు జల వనరులతో, పరిశ్రమలతో కళకళలాడుతోందని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం సీఐఐ, పీడబ్ల్యుసీ సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో ప్రసంగించారు.

 

‘‘దక్షిణ కొరియా కంపెనీ à°•à°¿à°¯ మోటార్స్‌ తన కార్ల ఫ్యాక్టరీని రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా కలగా మిగిలిన నదుల సంధానం ప్రక్రియను చేసి చూపించాం. రాయలసీమకు మునుపెన్నడూలేనంతగా నీటిని అందించాం. ఆంధ్రప్రదేశ్‌కు రెండు పారిశ్రామిక కారిడార్‌లు à°’à°• వరం. వైజాగ్‌-చెన్నై, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్లను పారిశ్రామికాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నాం. à°ˆ రెండూ మాకు వరాల్లాంటివి’’ అని లోకేశ్‌ వివరించారు.

 

వివిధ ప్రాంతాల్లో వనరులు, మౌలిక వసతుల లభ్యతను అనుసరించి క్లస్టర్ల వారీగా పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు లోకేశ్‌ వివరించారు. తిరుపతి ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌లో సెల్‌కాన్‌, డిక్సన్‌, కార్బన్‌లాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని లోకేశ్‌ గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో ఒకేచోట 12 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించామని లోకేశ్‌ వివరించారు. అమరావతిని ప్రజా రాజధాని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. à°ˆ సమావేశంలో నీతి ఆయోగ్‌ ప్రతినిధి అమితాబ్‌ కాంత్‌, అపోలో గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ శోభనా కామినేని, సీఐఐ డైరెక్టర్‌ ప్రతినిధి చంద్రజిత్‌ బెనర్జీ, పీడబ్ల్యుసీకి చెందిన మనీశ్‌ తదితరులు పాల్గొన్నారు.