అమరావతిలో ప్రఖ్యాతి చెందిన అమృత విశ్వవిద్యాలయం

Published: Wednesday January 24, 2018

ప్రఖ్యాతి చెందిన అమృత విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంగణానికి వచ్చే నెల 7à°µ తేదీన శంకుస్థాపన జరగనున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేతులమీదుగా à°ˆ కార్యక్రమం జరగబోతోందని సమాచారం. రాజధాని గ్రామాలైన నవులూరు- ఎర్రబాలెంల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాల్లో రూపుదిద్దుకోబోతున్న à°ˆ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు సంబంధించిన ఆకృతులను ఇటీ వల సీఎంకు ‘అమృత’ ప్రతినిధులు చూపారు. ఇటు స్థానిక చరిత్రను చాటే మంగళగిరి గాలి గోపురాన్ని స్ఫురింపజేసే ప్రవేశద్వారంతోపాటు అటు ఆధునికతను కలబోసి తయారుచేసిన à°ˆ డిజైన్లను చంద్రబాబు ఆమోదించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించి, చురుగ్గా కొనసాగించి, à°ˆ ఏడాది ఆగస్టులో అమరావతి క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ కోర్సు తరగతులను ప్రారం భించాలని అమృత విద్యాసంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

 

    దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో 9వదిగా, ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో అగ్ర గామిగా, ఆసియాలోని బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168à°—à°¾ గుర్తింపు పొందిన అమృతకు ఇప్పటికే దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో 5 క్యాం పస్‌లున్నాయి. à°…à°® రావతిలో రాబోయేది దాని 6à°µ ప్రాంగణం. à°ˆ క్యాంపస్‌కు సంబంధించిన కొన్ని విశేషాలిలా ఉన్నాయి.

 

  • అమృత అమరావతి క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌, మెడికల్‌ వైద్యసంస్థలు (సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో సహా) నెల కొల్పనున్నారు.

  • 5 ఏళ్లలో పూర్తయ్యే తొలి దశను 150 ఎకరాల్లో, 5 నుంచి 7 ఏళ్లల్లో సిద్ధమయ్యే మలి దశను 50 ఎకరాల్లో నిర్మించనున్నారు.

  • మొత్తం 6 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణముండే 7 అంతస్థుల భవన సముదాయాలను à°ˆ క్యాంపస్‌లో నిర్మిస్తారు.

  • à°ˆ ప్రాంగణ ప్రవేశద్వారాన్ని చారిత్రాత్మకం, సమున్నతమైన మంగళగిరి గాలి గోపురం ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు.

  • పెద్ద సంఖ్యలో వృక్షాలు, ఆకట్టుకునే ల్యాండ్‌స్కేపింగ్‌తో ప్రాంగణం పచ్చదనంతో అలరారేలా చూడనున్నారు. దీంతో క్యాంపస్‌లో ఆక్సిజన్‌ లభ్యత పెరిగి, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్య నభ్యసించగలుగుతారన్నది యాజమాన్య ఉద్దేశ్యం.

  • ఇంజినీరింగ్‌ విభాగ భవంతి మధ్యభాగాన్ని అబ్బురపరచే సృజనాత్మకతతో, వర్తులాకారంలో తీర్చిదిద్దనున్నారు.

  • విద్యార్థినీ విద్యార్థుల కోసం వేర్వేరుగా వసతిగృహాలను జి ప్లస్‌ 10 ఫ్లోర్లతో నిర్మించనున్నారు.

  • అధ్యాపకులు, ఉద్యోగుల కోసం లక్షకు పైగా చదరపుటడుగుల విస్తీర్ణంలో, 14 అంతస్థుల్లో, 104 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు.