కేంద్రం డబ్బులు ఇస్తామన్నా ఏపీ సర్కారు తీసుకోవడంలేదు.

Published: Friday November 23, 2018
: à°•à±‡à°‚ద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్‌) à°•à°¿à°‚à°¦ 90 శాతం నిధులు ఇవ్వడం! విదేశీ సహాయ ప్రాజెక్టు (ఈఏపీ) రుణంలో 90 శాతం అసలుతోపాటు వందశాతం వడ్డీ à°­à°°à°¿à°‚à°šà°¡à°‚! ప్రత్యేక హోదా ప్రయోజనాల్లో ఇవే ప్రధానమైనవి! 14à°µ ఆర్థిక సంఘం సిఫారసులను బూచిగా చూపి, సాంకేతికాంశాలను వల్లెవేస్తూ... ‘హోదా’ ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. అయితే... హోదా ప్రయోజనాన్నింటినీ, పైసా తక్కువకాకుండా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఢిల్లీలో, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రకటించారు. ‘పేరు ఏదైనప్పటికీ ప్రయోజనం అదే’ అని స్పష్టంగా చెప్పినందుకే... ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
 
కానీ... ప్యాకేజీ లెక్క కట్టుకదల్లేదు. నిర్దిష్ట ఐదేళ్ల కాలంలో ఈఏపీల à°•à°¿à°‚à°¦ రుణం తెచ్చుకుని, ఖర్చు చేయడం సాధ్యం కాదు కాబట్టి... à°† మేరకు దేశీయ ఆర్థిక సంస్థల ద్వారా రుణం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరింది. రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై ప్రభావం పడుతుందని తెలిసికూడా... à°† రుణం మీరే తెచ్చుకోండంటూ కేంద్రం ఉచిత సలహాలు ఇచ్చింది. చివరికి... ఉన్నట్టుండి ఎస్పీవీని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టేలా... ‘కేంద్ర ప్రాయోజిత పథకాల à°•à°¿à°‚à°¦ 90 శాతం నిధులు మాత్రమే ఇస్తాం! విదేశీ సహాయ ప్రాజెక్టులకు మా త్రం అదనంగా ఇవ్వలేం’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్రం à°—à°¤ కొంతకాలంగా సలహాలు ఇస్తోంది. సీసీఎస్‌ à°•à°¿à°‚à°¦ ఇచ్చే నిధులతోనూ ఈఏపీల అసలు చెల్లించుకోవాలని సూచిస్తోంది. రాష్ట్ర అధికారులు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు.
 
తిరకాసు లెక్కలు...
ప్రస్తుతం ఒక్క ఉపాధి హామీకి మినహా మిగిలిన ఏ పథకానికీ కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వడంలేదు. ఆయా పథకాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, 40 శాతం, 50 శాతం చొప్పున భరిస్తోంది. ఇప్పుడు కొత్తగా అన్నింటికీ 90 శాతం ఇస్తామని... తద్వారా మిగిలిన నిధులనే ‘ఈఏపీ’à°² కిందతామిచ్చినట్లుగా సర్దుకోవాలని కేంద్రం చెబుతోంది. అసలు విషయేమిటంటే... హోదాతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికైనా ఈఏపీల à°•à°¿à°‚à°¦ కేంద్రం 70 శాతం భరిస్తుంది. ప్యాకేజీ హామీ మేరకు రాష్ట్రానికి మరో 20 శాతం అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఏపీలో 2015 నుంచి మూడేళ్లలో ఏడు ఈఏపీలకు రుణాలు ఖరారయ్యాయి. 2018à°•à°¿ సంబంధించి ఈఏపీలు చర్చల దశలో ఉన్నాయి.
 
సాధారణంగా ఈఏపీలకు అసలు చెల్లింపులు రుణం తీసుకున్న తర్వాత ఐదు లేదా ఏడేళ్లకు మొదలవుతాయి. 2015-2017 వరకు ఏపీకి ఖరారైన ఈఏపీలకు అసలు చెల్లింపు 2020 తర్వాత నుంచి చేయాలి. ప్రస్తుతం ఈ పథకాలకు సంబంధించిన వడ్డీ రూ.15.81 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. అయితే, ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 2020 తర్వాత కేంద్రం అదనంగా 20 శాతం అసలు చెల్లింపులు చేస్తుందో లేదో అని ఆర్థిక శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఈ అంశంపై ఎలాంటి స్పష్టత రాలేదని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే నిధులు ఇస్తోందని, ప్రత్యేకించి 90 శాతం నిధులు ఇవ్వడంలేదని అధికారులు తెలిపారు.