దేశంలో అనధికార అత్యవసర పరిస్థితి.... గంటా విమర్శ

Published: Monday November 26, 2018
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంస్థలపై ఈడీ దాడులు బీజేపీ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ఠ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. విజయవాడలో à°“ ప్రకటన చేస్తూ, ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ à°·à°¾ కుమారుడు జయ్‌ షాపై కేసుల సంగతేంటి? అమిత్‌à°·à°¾ భార్య, కొడుకు, కోడలుకు చెందిన టెంపుల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వ్యవహారంపై కథనాలను ప్రసారం చేసే ధైర్యం జాతీయ మీడియాకు ఉందా? జయ్‌ à°·à°¾ ఆస్తులపై దాడులు చేసే ధైర్యం ఈడీ, ఐటీలకు ఉందా? బీజేపీతో సఖ్యతగా ఉంటే ఎలాంటి దాడులు జరగవు.
 
ఎదురు తిరిగితే మాత్రం తమ జేబు సంస్థలను ఉసిగొల్పి కక్ష సాధిస్తారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సంస్థలపై ఈడీ నిర్వహించిన దాడులే దీనికి నిదర్శనం’ అని విమర్శించారు. విశాఖలో మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘మోదీ నిరంకుశ విధానాలతో ప్రజాస్వామ్య మనుగడకు పెనుప్రమాదం ఏర్పడుతోంది. దేశంలోని వ్యవస్థలను మోదీ, à°·à°¾ ద్వయం దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఆర్‌బీఐ, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇటువంటి చర్యల వల్ల దేశంలో అనధికార అత్యవసర పరిస్థితి ఏర్పడింది’ అని విమర్శించారు.