29న పీఎస్‌‌‌‌‌ఎల్వీ-సీ43 ప్రయోగం

Published: Tuesday November 27, 2018

ఇటీవలే ‘బాహుబలి’ విజయంతో జోష్‌ మీదున్న ఇస్రో ఈసారి పీఎ్‌సఎల్వీ-సీ43 ద్వారా 31 ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌) ప్రథమ ప్రయోగ వేదిక నుంచి à°ˆ నెల 29à°¨ ఉదయం 9:57 గంటలకు పీఎస్‌‌‌‌‌ఎల్వీ-సీ43 రాకెట్‌ ద్వారా à°’à°• స్వదేశీ, 30 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. à°ˆ మేరకు మంగళవారం షార్‌లో రాకెట్‌ సన్నద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్‌), లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాలు జరుగనున్నాయి. అనంతరం బుధవారం ఉదయం 5:57 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తారు. గురువారం ఉదయం 9:57 గంటలకు రాకెట్‌ను రోదసిలోకి ప్రయోగించనున్నారు. à°ˆ రాకెట్‌ ద్వారా à°’à°• స్వదేశీ, 30 విదేశీ నానో ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి చేరవేయనున్నారు. విదేశీ ఉపగ్రహాల్లో 23 అమెరికాకు చెందినవి కాగా.. మిగిలిన 7 వివిధ దేశాలకు చెందినవి. భారత్‌కు చెందిన 380 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం హైసి్‌సను భూమికి 630 కిలోమీటర్ల ఎత్తులో, మిగిలిన 30 విదేశీ ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులోకి à°ˆ రాకెట్‌ చేరవేయనుంది.