నాది రజినికాంత్ ది ఒకటే దారి : కమల్ హాసన్

Published: Friday January 26, 2018

రాజకీయాల్లో రజనీకాంత్‌ది, తనది ఒకటే లక్ష్యమని, తమ మార్గాలు వేరైనా అవినీతి లేని సమాజాన్నే తామిద్దరం కోరుకుంటున్నామని సినీనటుడు కమల్‌హాసన్‌ చెప్పారు. గురువారం చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో రజనీతో కలిసి పనిచేసే అవకాశాలపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

 

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కమల్‌ చేపట్టబోయే ప్రజాయాత్రకు ‘నాళై నమదే’ (రేపు మనదే) అని పేరు పెట్టారు. ఇది ఎంజీఆర్‌ నటించిన సినిమా పేరు. తన సొంతూరు రామనాథపురంలో ఫిబ్రవరి 21à°¨ à°ˆ యాత్రను ఆయన ప్రారంభించనున్నారు. అదే రోజున పార్టీ పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. భావితరాలు జీవించేందుకు తమిళనాడును స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో à°ˆ యాత్ర చేపడుతున్నానని, à°’à°• గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కూడా కమల్‌ ప్రకటించారు.