పోలవరంపై పిల్లిమొగ్గ.. 2 రోజుల్లోనే మారిన మాట

Published: Sunday December 02, 2018
పోలవరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్లేటు తిరగేసింది. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణకు సుప్రీంకోర్టులో అంగీకరించిన కేంద్రం... అఫిడవిట్‌ దాకా వచ్చేసరికి మాట మార్చింది. ‘అబ్బే... అప్పుడు మా వాళ్లు అనాలోచితంగా à°† హామీ ఇచ్చారు. దానిని పట్టించుకోవద్దు’ అని న్యాయస్థానాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పనులు చేస్తున్నారంటూ ఒడిసా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. à°ˆ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
 
నిబంధనల ప్రకారం ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని... దీనిపై ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీ తెలిపారు. ఏపీ తరఫు న్యాయవాది ఏకే గంగూలీ కూడా ఇదే విషయం చెప్పారు. ‘‘ప్రజాభిప్రాయ సేకరణను ముంపు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రమే చేపట్టాలి. దీనిపై ఒడిసా సర్కారుకు పలుమార్లు విజ్ఞప్తి చేశాం. à°ˆ ప్రక్రియకు అవసరమయ్యే ఖర్చును కూడా à°† రాష్ట్ర ఖజానాలో జమ చేశాం. అయినా పట్టించుకోలేదు’’ అని వివరించారు. à°ˆ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని... కేంద్రం కూడా పట్టించుకోలేదని చెప్పారు. à°ˆ నేపథ్యంలో కేంద్రమే స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న కేంద్ర న్యాయవాది ఖాద్రీ... అందుకు అంగీకరించారు.
 
దీంతో... ప్రజాభిప్రాయ సేకరణ విధి విధానాలు తెలుపుతూ శనివారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్‌ సునామని కెర్కెట్టా శనివారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే... ప్రజాభిపాయ్ర సేకరణపై గురువారం నాటి వైఖరికి పూర్తి భిన్నంగా స్పందించారు. దీంతో కేంద్రానికి సంబంధం లేదనేలా వ్యవహరించారు. ‘ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకకరణ జరుపుతామని మా తరఫు న్యాయవాది చెప్పారు. అయితే... దీనిపై సీనియర్‌ అధికారుల సూచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా... à°’à°• జూనియర్‌ లెవెల్‌ అధికారితో మాట్లాడి కోర్టుకు అనాలోచితంగా హామీ ఇచ్చారు. అందువల్ల ఇది అనుకోకుండా చెప్పిన మాటగా భావించి మన్నించండి’’ అని కోరారు. అంటే, కీలకమైన à°ˆ ప్రక్రియపై కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట!
 
ఇది మరో షాక్‌...: ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌లలో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న సుప్రీం ఆదేశాలను ఏపీ సాగునీటి శాఖ వర్గాలు స్వాగతించాయి. ‘‘నిబంధనల ప్రకారం ఒడిసా సర్కారే à°† పని చేయాలి. ఒడిసా దీనిని పట్టించుకోలేదు. కేంద్రమూ స్పందించలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది’’ అని గురువారం అధికారవర్గాలు తెలిపాయి. శనివారం సీన్‌ మారిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.