ఇకపై సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే.. దర్శనం

Published: Wednesday December 05, 2018

 à°…మ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లోనే ఇంద్రకీలాద్రికి రావాల్సి ఉంటుంది. దేవస్థానం అధికారులు గతంలోనే విధించిన à°ˆ నిబంధనను నూతన సంవత్సరంలో కచ్ఛితంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. భారత మహిళా వన్డే క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌, ఇతర సభ్యులు శుక్రవారం జీన్స్‌ ఫ్యాంట్లు, à°Ÿà±€ షర్టులు ధరించి రాగా, పాలకమండలి సభ్యులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడంపై విమర్శలొచ్చాయి. దీంతో ఇక మీదట భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలనే నిబంధనను కచ్ఛితంగా అమలు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు.  జనవరి ఒకటో తేదీ నుంచి à°ˆ నిబంధనను కచ్ఛితంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సంప్రదాయ దుస్తులతోనే భక్తులు దర్శనాలకు రావాలనే నిబంధనను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.