ఎంపీ రామ్మోహన్‌కు సుష్మాస్వరాజ్‌ హామీ

Published: Friday December 14, 2018
పాకిస్థాన్‌ చెరలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. ఇప్పటికే ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు à°ˆ మేరకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది మత్స్యకారులు.. గుజరాత్‌లో వలస కూలీలుగా ఉంటూ సముద్రంలో చేపలవేటకు వెళ్లి à°—à°¤ నెల 27à°¨ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన విషయం తెలిసిందే. వారిని విడిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను గురువారం పార్లమెంట్‌లో కలిసి విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతంచేయాలని కోరుతూ లేఖ అందించారు.
 
 
దీనిపై స్పందించిన మంత్రి కచ్చితంగా వారిని విడిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బందీలైన మత్స్యకారుల పౌరసత్వ గుర్తింపు ప్రక్రియ పాకిస్తాన్‌ అధికారులు నిర్వహిస్తున్నారని, భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా à°ˆ విషయంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కాగా.. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన మత్స్యకార నాయకులు కూడా సుష్మాస్వరాజ్‌కు గురువారం వినతిపత్రం అందించారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో పూసపాటిరేగ మండల వైసీపీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, తిప్పలవలస మాజీ సర్పంచ్‌ వాసుపల్లి అప్పన్న, బర్రి కామయ్య తదితరులు కేంద్ర మంత్రిని కలిశారు. ఇప్పటికే బందీలను విడిచిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వారికి ఆమె స్పష్టంచేశారు. వీలైనంత త్వరగా వారిని రప్పిస్తామని మంత్రి హామీఇచ్చారు.