నీటిలోనే కుళ్లిపోతున్న వరి

Published: Friday December 21, 2018

తుఫాను కష్టాలు రైతును వెంటాడుతూనే ఉన్నాయి. వర్షాలకు నీటి మునిగిన పంట.. నీటిలోనే కుళ్లి పోతోంది. నీటిలో ఉన్న వరి ఓదెలను గట్లపై ఎండబెట్టినా... వాతావరణంలో నిమ్ము, ఉష్ణోగ్రతలు తగ్గడంతో వరి కంకులు మొలకెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలో 22 మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. నష్టం అంచనాలను గురువారం నుంచి అధికారులు సేకరిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో పరిహారాన్ని బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తామని కలెక్టర్‌ కోన శశిధర్‌ చెప్పారు.