ఎన్నికల గుర్తును ప్రకటించిన జనసేన పార్టీ

Published: Sunday December 23, 2018
 à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించింది. తమ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ అంటూ జనసేన ట్విట్టర్‌లో ప్రకటించింది. 2019లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు, తెలంగాణలోని 17 స్థానాల్లో గ్లాసు గుర్తు ద్వారానే ప్రజల ముందుకు వెళ్తున్నట్లు à°† పార్టీ పేర్కొంది.
 
 
జనసేన పార్టీని 2014 మార్చి 14న సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా జనసేనాని ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణలో ఈ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి విధానాన్ని అవలంభించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ కానీ, ప్రచారం కానీ నిర్వహించకుండా స్థిరత్వాన్ని కనబరిచింది.
 
 
టీడీపీతో విభేదించాక à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనాని.. అందుకోసం గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల్లో పర్యటించడం, ప్రజలతో నేరుగా మమేకం అవడం వంటి కార్యక్రమాల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోరుగా పాల్గొంటున్నారు. ఏపీలో లోక్‌సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు కీలక నేతలను కలుపుకుని పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ప్రజలు ఎలాంటి ఆదరణ చూపిస్తారో వేచి చూడాలి.