ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్‌ 4వ తేదీన తుది ఓటర్ల జాబితా

Published: Tuesday December 25, 2018
బోగస్‌ ఓట్లు ఉండనీయం.. అర్హులకు అన్యాయం జరగనీయమని పదేపదే చెబుతు న్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా.. అన్నట్టుగానే వడపోత పనిని నేరుగా చేపట్టారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం నాగులూటి, బైర్లూటి చెంచు గూడేలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇంటింటికీ, గూడెం, గూడేనికి వెళ్లి.. ఓటర్ల నమోదు తీరును స్వయంగా పరిశీలించారు. ఏ గ్రామానికి వెళ్తున్నారనేది ముందుగా జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న వారి పేర్లు à°…à°¡à°¿à°—à°¿, అవి జాబితాలో ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. నాగులూటి గూడెంలో ఇప్పటికే 396 మంది చెంచులు ఓటరు జాబితాలో ఉన్నారు. మరో 19 మందిని కొత్తగా చేర్చారు. నందికొట్కూ రు నియోజకవర్గం పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు ఎస్సీ కాలనీలో 19 ఇళ్లకు వెళ్లారు. à°† ఇళ్లలో 18 ఏళ్లు నిండిన వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించారు. నాగులూటి గూ డెం నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో సిసోడియాకు కొందరు చెంచులు కనిపించారు. ఓటరుగా నమోదు అయ్యారా అని.. వారిని ప్రశ్ని స్తే లేదని సమాధానం చెప్పారు. వారంలోపు వారి పేర్లు జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంటె జాయింట్‌ కలెక్టర్‌ పట్టన్‌శెట్టి రవి తదితరులు ఉన్నారు. అనంతరం సిసోడియా మీడియాలో మాట్లాడారు.
 
 
‘‘ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ ఎన్నిక à°² షెడ్యూల్‌ ఫిబ్రవరిలో విడుదల అవుతుంది. దానికితగినట్టు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి’’ అని సిసోడియా ఆదేశించారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలలో చైతన్యం తక్కువగా ఉంటుందని, వారిని ఓటరుగా నమోదు చేసేందుకు అధికారు లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ‘‘రాష్ట్రంలో 3.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 4à°¨ తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం. బూత్‌స్థాయి ఓటర్ల జాబితాను పరిశీలించాలి’’ అన్నారు.