4,5 విడతల రుణమాఫీ ఒకేసారి

Published: Thursday December 27, 2018
వ్యవసాయ రంగానికి నాలుగేళ్ల క్రితం కేవలం 4.5ు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులు ఉండగా.. ఇప్పుడు రెట్టింపు పైగా పెంచి 10 శాతానికి తీసుకెళ్లినట్లు రాష్ట్రప్రభుత్వం వ్యవసాయంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు..
  • 2013-14 బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు రూ.6,128కోట్లు. 2018-19లో రూ.19,070కోట్లకు పెంపు.
  • వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 2014 నుంచి స్థిరమైన పెరుగుదల. 2014-15లో వృద్ధిరేటు 3.55 శాతమే. 2015-16లో 7.78ు, 2016-17లో 14.91ు, 2017-18లో 17.76 శాతానికి పెరుగుదల.
  • రైతు రుణమాఫీ à°•à°¿à°‚à°¦ రూ.24 వేల కోట్లు కేటాయింపు. 58.29 లక్షల రైతులకు లబ్ధి. ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.15,147.57 కోట్లు చెల్లింపు. మిగతా 2 విడతల మొత్తం ఒకేసారి జనవరి మొదటివారంలో చెల్లింపు.
  • కౌలు రైతులకు రూ.9411 కోట్ల రుణాలు.
  • రూ.3,556 కోట్లతో పంటల కొనుగోలు.
  • నాలుగేళ్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీ à°•à°¿à°‚à°¦ రూ.5,500 కోట్లు.
  • నూరు శాతం సబ్సిడీతో 25 లక్షల హెక్టార్లకు ఉచితంగా సూక్ష్మపోషకాలు.
  • 47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా
  • ఆర్గానిక్‌ పంటల సాగు రాష్ట్రంలో 8 శాతం.
  • రైతు రథం పథకం à°•à°¿à°‚à°¦ 12,217 పెద్ద ట్రాక్టర్లు, రోటోవేటర్ల పంపిణీ.
  • వరి ఉత్పాదకతలో రెండోస్థానం. జొన్నలో మొదటి స్థానం.
  • భూసార పరీక్షల అమల్లో రాష్ట్రానికి మొదటి స్థానం. 68 లక్షల మంది రైతుల పొలాల్లో 103.35 లక్షల భూసార పరీక్షలు.
  • కర్నూలు జిల్లా తంగడంచలో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కు.
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 39.33లక్షల à°® ంది రైతులకు రూ.3,608 కోట్ల చెల్లింపు.