అగ్రిగోల్డ్‌ బాధితులు దీక్షను విరమించారు

Published: Sunday December 30, 2018
 à°…గ్రిగోల్డ్‌ బాధితులు తాము చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సత్వరమే చర్చలు తీసుకుంటుందని మంత్రులు హామీ ఇవ్వడంతో బాధిత సంఘం ప్రతినిధులు సంతృప్తి చెందారు. సత్వర న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలోని ధర్నాచౌక్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వీరి దీక్షను భగ్నం చేసి, దీక్షలో కూర్చుకున్న అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, తిరుపతిరావును అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. à°ˆ అరెస్టులను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట శనివారం బాధితులు ధర్నా చేశారు. కాగా, పోలీసులు దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడంతో ప్రభుత్వాస్పత్రిలోనే ఆమరణ దీక్షకు దిగిన అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంఘం ప్రతినిధులతో మంత్రులు నక్కా ఆనందబాబు, కాల à°µ శ్రీనివాసులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చర్చలు జరిపారు.
 
అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేసి, బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆస్తుల వేలానికి సంబంధించి జనవరి 4నుంచి 12లోపు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖ లు చేస్తామన్నారు. ఫిబ్రవరి 8లోగా హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను విక్రయిస్తామని, ఇప్పటి వరకూ న్యాయస్థానానికి చూపించని ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. దీనికోసం 300కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. à°† నిధులతో ముందుగా రూ.5వేలు, 10వేల బాండ్లు ఉన్న 10 à°² క్షల 75వేల మంది బాధితులకు న్యాయం చేస్తామన్నారు. à°ˆ హామీలతో బాధిత సంఘ ప్రతినిధులు సంతృప్తి చెందడంతో మంత్రులు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.