ప్రజలు మార్పు కోరుతున్నారు దానికి జనసేనే ఆలంబన

Published: Saturday January 12, 2019
జనసేన సమాజ వికాసం కోసమే పని చేస్తుందని à°† పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కులం పేరుతో ప్రజలను విడగొట్టదని స్పష్టం చేశారు. ‘ప్రజల్లో ఎంతో ఆగ్రహం ఉంది. ముఖ్యంగా మహిళలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. దానిని మార్పు కోసం ఉపయోగించుకోవడమే పార్టీ లక్ష్యం’ అని తెలిపారు. శుక్రవారం విజయవాడలోని జనసేన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా నేతలతో ఆయన మాట్లాడారు. కులం, మతం, ప్రాంతీయతను నమ్ముకుని తాను రాజకీయాల్లోకి రాలేదని, మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇంకా ఏమన్నారంటే...
 
‘మన వ్యవస్థలో కులం బలంగా పెనవేసుకుపోయింది. కులాల ఆలోచనలు, వాటి మధ్య ఘర్షణలను అధిగమించకపోతే సామాజిక వినాశనం తప్పదు. నాయకులంతా కలసి వ్యవస్థను బలహీనపరిచారు. దానిని బలోపేతం చేయడమే జనసేన లక్ష్యం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. à°ˆ మార్పునకు జనసేన ఆలంబనగా మిగలాలి’
 
‘నేను ఇంటర్‌తోనే ఆపేసినా చదవడం మాత్రం ఆపలేదు. రోజుకు కనీసం 8 గంటలపాటు చదువుతూనే ఉంటాను. మార్క్స్‌ నుంచి కాన్షీరాం వరకూ, నక్సలిజం, మండల్‌ రిజర్వేషన్లు, రామజన్మభూమి వివాదం, సోవియట్‌ పతనం, సైన్స్‌-టెక్నాలజీ వంటి అనేక విషయాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాను. నా ఆలోచనలూ అనుభవాల నుంచి పుట్టినవే జనసేన ఏడు మూల సిద్ధాంతాలు. రాత్రికిరాత్రి పార్టీ నిర్మాణం చేయడం సాధ్యం కాదు. జనసేన నాయకుడిగా నా నడక ఎలా ఉంటుందో కార్యకర్తలకు తెలియజేసిన తర్వాత నా దారిలో నడవాలని చెప్పడానికి నాలుగేళ్ల సమయం తీసుకున్నాను. మన భావజాలం ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుంది. అందుకే 25 ఏళ్లు పోరాడేందుకు వచ్చాను. à°’à°• దేహానికి à°’à°• రక్తనాళం ఎలా సరిపోదో.. à°’à°• దేశానికి à°’à°• నది ఎలా సరిపోదో.. à°’à°• పార్టీకి à°’à°• నాయకుడు సరిపోడు. కృష్ణాజిల్లా రాజధాని సంబంధిత ప్రాంతం కాబట్టి నేతలు ఇంకా బలంగా పనిచేయాలి’ అన్నారు.
 
‘నాయకులు మాట్లాడుతున్న మాటలకు, యువత మాట్లాడుతున్న మాటలకూ తేడా కనిపిస్తోంది. జగన్‌ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కలలు కంటారు. మళ్లీ తానే రావాలని చంద్రబాబు పోస్టర్లు వేయించుకుంటారు. వారలా అడుగుతుంటే.. మాకు 25 కిలోల బియ్యం అవసరం లేదు.. 25 ఏళ్ల భవిత కావాలని యువత అడుగుతోంది. అందరి సమస్యలకూ పరిష్కారమార్గం చూడాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే చేయగలమనిపించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత నేను నిలబడగలనా లేదా అన్న ఆలోచన వచ్చినా, రాష్ట్ర విభజన తర్వాత వ్యవస్థలో మార్పు కోసం నిలబడి తీరాలనిపించింది. గతంలో జనసేనకు అసెంబ్లీ స్థానాలు రావని చెప్పినవారే ఇప్పుడు కలసి రావాలని ఆహ్వానిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలతో మాట్లాడిస్తున్నారు. ఇది మన బలానికి నిదర్శనం’ అన్నారు.