భారీగా చార్జీలు పిండేస్తున్న ప్రైవేటు వాహనదారులు

Published: Thursday January 17, 2019
సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజులపాటు కోలాహలంగా సంబరాలు చేసుకున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు... ఇక ఆయా పనుల నిమిత్తం స్వగ్రామాల నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి నగరాలకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మళ్లీ వారిని చార్జీల కష్టాలు వెంటాడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచే రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ రద్దీగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల యజమానులు చార్జీల ధరలు అమాంతం పెంచేస్తున్నారు.
 
 
దీంతో ఆర్టీసీ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో చూసిన చాలామందికి ‘సీట్లు ఫుల్‌’ అనే సందేశం దర్శనమిస్తోంది. అయితే బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఆధారంగా అప్పటికప్పుడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. గురువారం కూడా ఇదేస్థాయిలో రద్దీ ఉంటుందని, తర్వాత ఆదివారం రాత్రికి అత్యధికంగా తిరుగు ప్రయాణికులు ఉంటారని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. à°ˆ దృష్ట్యా ఏపీలోని అన్ని జిల్లాల నుంచి రెగ్యులర్‌ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 927 బస్సులు హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాలకు బుధవారం నుంచి ఆదివారం వరకూ నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్‌ విభాగం అధికారి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
 
 à°‰à°­à°¯ గోదావరి జిల్లాల నుంచి 433; ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 378 బస్సులు; రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి ఏకంగా 875 బస్సులను తిరుగు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆర్టీసీ మరిన్ని బస్సులు పెంచేందుకు కూడా సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పలువురు తిరుగు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను అద్దెకు మాట్లాడుకుని కుటుంబాలతో సహా తిరిగి వెళుతున్నారు.