నాలుగేళ్లు పనిచేసేలా ఇన్‌కం సర్టిఫికెట్‌

Published: Saturday January 19, 2019
ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశంలో జీవితాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన సర్టిఫికెట్‌ జీవితాంతం ఉపయోగపడేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అనిల్‌ చంద్ర పునేఠ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యదర్శుల సమావేశంలో à°ˆ అంశంపై చర్చించారు. సీఎస్‌ మాట్లాడుతూ.. à°ˆ సర్టిఫికెట్ల కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను రెవెన్యూ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఒకసారి ఇచ్చిన సర్టిఫికెట్‌ జీవితాంతం ఉపయోగపడేలా చూడాలన్నారు. ఆదాయంలో మార్పు వచ్చే అవకాశం ఉన్నా.. à°† సర్టిఫికెట్‌ కూడా నాలుగేళ్ల వరకు ఉపయోగపడుతుందని చెప్పారు. à°ˆ సర్టిఫికెట్ల విషయంలో అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. 15 రోజుల్లో జీవో రూపొందించాలని ఆర్టీజీ సీఈవో అహ్మద్‌బాబుకు సూచించారు. అవసరంలేని పోలీస్‌ వెరిఫికేషన్‌, ఇతర సర్టిఫికెట్లను తీసివేయాలన్నారు. సర్టిఫికెట్ల విషయంలో ప్రజలు ఇబ్బందిపడకుండా చూడాలని సీఎస్‌ చెప్పారు. కాగా, à°ˆ నెల 21à°•à°¿ మంత్రి మండలి ఆమోదించవలసిన అన్ని ఫైళ్లను సిద్ధం చేయాలని కార్యదర్శులకు, హెచ్‌వోడీలకు సీఎస్‌ సూచించారు.
 
కేంద్రం నుంచి రావలసిన నిధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన పథకాలను అధ్యయనం చేసి à°† నిధులను పూర్తిస్థాయిలో పొందడానికి ప్రయత్నించాలన్నారు. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటివారంలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అవకాశం ఉన్న మేరకు రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తానన్నారు. à°ˆ-ప్రగతి, à°ˆ ఆఫీస్‌ ద్వారా సమయం చాలా ఆదా అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజలకు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిందన్నారు.