ఓఎన్జీసీలో రేడియో ధార్మిక పదార్థం మాయం..

Published: Sunday January 20, 2019
 à°ªà±‡à°°à± సీఎస్‌-137 ఐసోటోప్‌. ప్రకృతిలో లభించదు. కానీ అత్యంత రేడియో ధార్మిక పదార్థమైన యురేనియం-235ను న్యూక్లియర్‌ విచ్ఛిత్తి చేసి తయారు చేస్తారు. ప్రమాదకరమైన à°ˆ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుందని, దాని ప్రభావం మనుషులతో పాటు ఇతర జీవులు, వాతావరణంపై కూడా ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. అలాంటి ఐసోటోప్‌ ఉంచిన 30 కిలోల కంటైనర్‌ ఏపీలోని రాజమహేంద్రవరం ఓఎన్జీసీ బేస్‌ కాంప్లెక్స్‌ నుంచి మాయమైనట్లు సమాచారం. రేడియో ధార్మిక పదార్థాల కొనుగోలు, నిల్వ, భద్రత, రవాణా, నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే న్యూక్లియర్‌ ఎనర్జీ కమిషన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. కానీ ఇప్పుడు అటువంటి పదార్థం అదృశ్యం కావడంపై ఆందోళన నెలకొంది.
 
దీంతో రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన రేడియో ధార్మిక పదార్థం పేరు సీజియం-137 ఐసోటోప్‌ (సీఎస్‌-137). దీన్ని యురేనియం-235ను న్యూక్లియర్‌ విచ్ఛిత్తి చేసి తయారు చేస్తారు. ఇదంతా న్యూక్లియర్‌ ప్లాంటులో మాత్రమే జరుగుతుంది. ఇది à°’à°• క్షార లోహం. ఘన రూపంలో తెల్లటి చిన్న బిస్కట్‌ ముక్క, టాబ్లెట్‌ మాదిరిగా రెండు నుంచి మూడు అంగుళాలు ఉంటుంది. అదే లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. ఓఎన్జీసీలో అదృశ్యమైన దాని విలువ దాదాపు రూ.35 లక్షలుగా అధికారులు చెప్తుండటం గమనార్హం.