పాడేరు సభలో పవన్‌ ధ్వజం

Published: Thursday January 24, 2019
 à°µà°šà±à°šà±‡ ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని వర్గాలూ à°…à°‚à°¡à°—à°¾ నిలవాలని à°† పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ వెనుక వైసీపీ నేతలే ఉన్నారని ధ్వజమెత్తారు. బుధవారం విశాఖ జిల్లా పాడేరు అంబేడ్కర్‌ కూడలి వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గిరిజన యువత ఉపాధి అవకాశాలు లేక గంజాయి బాటపడుతోందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే గిరిజన యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తుందని హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా, మైనింగ్‌కు దూరంగా ఉంటూ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం ద్వారా అనేక ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. సభలో పవన్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
 
‘ప్రభుత్వాలు పాడేరును అభివృద్ధి చేయలేదు. ఇక్కడ 30 పడకల ఆస్పత్రిని వంద పడకలు చేశారు. కానీ సదుపాయాలు లేకపోవడం వల్లే వైద్యులు రావడం లేదు. మేం వస్తే ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా డాక్టర్లు ఉండే ఆస్పత్రి పెడతాం. అందరూ మా పార్టీకి à°…à°‚à°¡à°—à°¾ ఉండాలి. టీడీపీ, వైసీపీ.. చంద్రబాబు, జగన్‌à°² పార్టీలు కావు. ఇతరులు పెట్టిన పార్టీలను వాళ్లు నడుపుతున్నారు. జనసేన అలా కాదు. సామాన్యుల పార్టీ. గిరిజనుల జోలికి ఎవరు వచ్చినా తాట తీస్తా. ఆస్ట్రేలియా ప్రధాని తమ పార్లమెంటులో గిరిజనులకు అన్యాయం చేసిన వారితో క్షమాపణలు చెప్పించారు. జనసేన ప్రభుత్వం సైతం అలా క్షమాపణలు చెప్పిస్తుంది. మన్యంలో బాక్సైట్‌ జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదు. ప్రస్తుతం బాక్సైట్‌ మైనింగ్‌కు జరుగుతున్న ప్రయత్నాల వెనుక వైసీపీ నేతలే ఉన్నారు’
 
అక్రమ మైనింగ్‌ను సీఎం అడ్డుకుని ఉంటే.. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను కోల్పోయే పరిస్థితి ఏర్పడేది కాదు. వారి మరణాలకు ఆయనే బాధ్యత తీసుకోవాలి. అప్పట్లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించాను. అయినా పట్టించుకోకపోవడం వల్ల ఇద్దరు నేతల ప్రాణాలు పోయాయి.’