అమరావతికి అంధురాలి విరాళం

Published: Friday January 25, 2019
 à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ అమరావతి నిర్మాణానికి à°“ అంధురాలు రూ.లక్ష విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన గూడూరు నాగేంద్రమ్మ తనకు గ్రామంలో ఉన్న నాలుగెకరాల భూమిపై వచ్చిన ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి అందజేసింది. ఆమె గురువారం ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబును కలిసింది. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తనను చాలా బాధించిందని, రాజధానికి తన వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో రూ.లక్ష ఇస్తున్నట్లు ఆమె తెలిపింది.
 
చంద్రబాబు పడుతున్న కష్టాన్ని గమనించి, ఆయనకు సహాయ, సహకారాలు అందించాలని ఆమె కోరింది. ఈ సందర్భంగా తన మూడేళ్ల మనవరాలు కుమారి ధన్వి ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని బాలికను చంద్రబాబుకు పరిచయం చేసింది. అంధురాలైన నాగేంద్రమ్మ రాజధానికి విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించిన సీఎం బాలిక ధన్వికి ఆశీస్సులు అందజేశారు.