‘ప్రజా సమస్యలపై ఒకే భావజాలం

Published: Saturday January 26, 2019

 ‘‘ప్రజా సమస్యలపై జనసేన, సీపీఐ, సీపీఎంలకు ఒకే రకమైన భావజాలం ఉండడంతో కలిసి పనిచేస్తున్నాం. ప్రజా ఉద్యమాలను రాజకీయ స్థాయికి తీసుకువెళ్లడం, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలి అన్న అంశాలను సమావేశంలో చర్చించాం. ఫిబ్రవరిలో ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తాం. అప్పుడే సీట్ల సర్దుబాటుపైనా చర్చలు ఉంటాయి’’ అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. విశాఖపట్నంలో à°“ ప్రైవేటు రిసార్ట్‌లో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. వామపక్ష అగ్రశ్రేణి నేతలు, జనసేన నేతలు సమావేశమయ్యారు. పలు అంశాలపై వివరంగా చర్చించారు. అనంతరం పవన్‌ వామపక్ష నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘పర్యావరణ కాలుష్యం, మైనింగ్‌ విధానం, భూసేకరణ చట్టం, జనసేన నిజనిర్ధారణ కమిటీ నివేదిక... తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించాం. ఈవీఎంలపై ఆరోపణలు వస్తున్నందున వాటిపై చర్చకు మేం డిమాండ్‌ చేస్తున్నాం’’ అని పవన్‌ తెలిపారు. విలేకరుల సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి, బీవీ రాఘవులు, నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. దిగువ తీర్మానాలను సమావేశం ఆమోదించిందని నేతలు మీడియాకు వివరించారు.