యువనేస్తం భృతి.. భారీగా పెంపు

Published: Friday February 01, 2019
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా యువనేస్తం పథకం à°•à°¿à°‚à°¦ నిరుద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 భృతిని భారీగా పెంచుతామని ప్రకటించారు. ఇందుకు కసరత్తు చేస్తున్నామని గురువారమిక్కడ తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీలో తెలిపారు. రైతులకు సాగుసాయం à°•à°¿à°‚à°¦ ఎకరానికి రూ.2,500 ఇస్తామని, ఇది కౌలు రైతులకు కూడా వర్తించేలా చేస్తామని చెప్పారు. రైతు రుణ మాఫీ బకాయిలు త్వరలోనే విడుదలవుతాయన్నారు. కాపులు, ఇతర ఆర్థిక బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎ్‌à°¸)కు రిజర్వేషన్లపై తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు.
 
కాపులకు ఐదు శాతం, ఇతర ఆర్థిక బలహీన వర్గాలకు మరో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాప్యం లే కుండా ఈ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చే నిమిత్తం ఒకట్రెండు రోజుల్లోనే ఆదేశాలు జారీ కావాలని ఆయన సూచించారు. ఇదే పనిలో ఉన్నామని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు చెప్పారు. 9వ తేదీన ఒకే రోజు నాలుగు లక్షల గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని, దీనికి అవసరమైన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు చేసుకోవాలని సీఎం అన్నారు. 2, 3, 4 తేదీల్లో పింఛన్ల పండగ జరపాలని, పేదల పండగగా నిర్వహించాలని సూచించారు. ఈ 3 రోజులు సంక్షేమ ఉత్సవాలుగా జరపాలన్నారు.
 
‘ఆటోలపై పన్ను రద్దు చేశాం. ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు ఇచ్చాం. ఇప్పటికే పింఛన్లు పది రెట్లు చేశాం. రూ.2 వేలు, 3 వేలు, రూ.3,500 ఇస్తున్నాం. పసుపు-కుంకుమ రెండు దశలుగా ఇస్తున్నాం. ఒక్కో మహిళకు రూ.20 వేలు ఇవ్వడం చరిత్ర. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఎవరూ చేయలేదు. చేనేతలకు, కొప్పుల వెలమలకు, శెట్టి బలిజలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. నాయీబ్రాహ్మణులకు, చేనేతలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఎంబీసీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్నాం. చిరుద్యోగులకు వేతనాలు పెంచాం.
 
వాళ్లందరి ఆదరణ పొందాలి. రైతుల రాబడిని రెట్టింపు చేశాం. 17 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 22 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. వీటన్నిటినీ శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒక్క పరిశ్రమ తెచ్చాడా? మనం తెచ్చిన వోక్స్‌వ్యాగన్‌ను పుణే తరిమేశారు. మనం కియా తెచ్చాం. తొలి కారు విడుదల చేశాం. దీనిపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రతినిధులు ప్రచారం చేయాలి. నాలుగున్నరేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. వాటి నుంచి దృష్టి మళ్లించాలని కుట్రలు చేస్తూ.. కావాలని బురదజల్లుతున్నారు. సమర్థంగా తిప్పికొట్టడం చాలా ముఖ్యం.’