అన్నాహజారే సంచలన హెచ్చరిక

Published: Monday February 04, 2019

అహ్మద్ నగర్ జిల్లా రాలేగాంసిద్ధి గ్రామంలో అన్నాహజారే దీక్ష ఐదో రోజుకు చేరింది. లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని అన్నాహజారే డిమాండు చేస్తూ చేపట్టిన దీక్షకు శివసేన కూడా మద్ధతు ప్రకటించింది. దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలను మరికొద్దిరోజుల్లోగా నెరవేర్చకుంటే నా పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. 1992లో అన్నాహజారేకు పద్మభూషణ్ అవార్డు లభించింది. అవినీతి నిర్మూలనకు లోక్ పాల్, లోకాయుక్తలను నియమించడంతోపాటు రైతుల కోసం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. అన్నాహజారే ఐదురోజులుగా దీక్ష చేస్తున్నందువల్ల 3.8 కిలోల బరువు తగ్గారని, బీపీ, షుగర్ పెరిగాయని వైద్యులు చెప్పారు. అహ్మద్ నగర్ కలెక్టరేట్ వద్ద అన్నాహజారే దీక్షకు మద్ధతుగా ఐదువేల మంది రైతులు నిరసన ప్రదర్శన చేశారు.