అగ్రిగోల్డ్‌’ బాధితులకు శుభవార్త

Published: Friday February 08, 2019
అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. డిపాజిటర్లకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతుండటంతో పది వేల రూపాయలలోపు డిపాజిట్‌ చేసిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు రూ.250 కోట్లు చెల్లించేలా గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ కేంద్రంగా 1995లో ఏర్పాటైన అగ్రిగోల్డ్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి మొత్తం రూ.6,380 కోట్లు సేకరించింది. 2014లో వేలాది మంది డిపాజిటర్లకు సంస్థ ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. దీంతో బాధితులు పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం à°ˆ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాం తాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేసింది.
 
చైర్మన్‌ అవ్వారు వెంకట రామారావుతోపాటు డైరెక్టర్లను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. హైకోర్టు ఆదేశాల మేరకు జప్తు చేసిన ఆస్తులను వేలం ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే ఇది ఆలస్యమవుతుండటంతో బాధితుల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విన్నవించింది. దీనిపై డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, సీఐడీ చీఫ్‌ అమిత్‌ గార్గ్‌తో చర్చించిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రూ.10వేల లోపు డిపాజిటర్లకు నగదు చెల్లించాలని నిర్ణయించారు. బాధితులకు చెల్లించే మొత్తాన్ని హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన జిల్లా కమిటీల ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందే బాధితుల సంఘం ప్రతినిధులతో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశముంది.