వేగంగా ‘గోదారి-పెన్నా’ పనులు

Published: Wednesday February 13, 2019
 à°—ోదావరి - పెన్నా అనుసంధానం తొలి దశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. టెండరు ప్రక్రియ ద్వారా à°ˆ పనులను మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. à°ˆ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద శంకుస్థాపన చేశారు. à°ˆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 24 నెలల గడువు ఉన్నప్పటికీ, 12 నెలల్లోనే పూర్తి చేసి ఖరీఫ్‌ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసేందుకు మేఘా సమాయత్తమవుతోంది.
 
ఇందులో భాగంగా గుంటూరు జిల్లా క్రోసూరువద్ద మూడో పంప్‌ హౌస్‌ పనులను మంగళవారం భూమిపూజ జరిపి, ప్రారంభించింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం నుంచి రాజుపాలెం వరకూ 45 కిలోమీటర్ల కాలువ, పైప్‌లైన్‌ పనులను మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టనున్నది. ఇందులో 39.8 కిలోమీటర్ల కాలువను గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా 4.5 కిలోమీటర్ల మేర తవ్వుతారు. దానికోసం ఆరు వరుసల పైప్‌లైన్‌ వేస్తారు. నీటిని కృష్ణా నది నుంచి ఎత్తిపోసి 18 పంపుల ద్వారా 120 రోజుల్లో 73 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేస్తారు.